ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
: నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు వెంటనే న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం నిర్వాసితులకు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా గుండాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం భూదాన్ భూముల్లో దమనకాండకు పాల్పడి పేదల ఇళ్లను కూల్చివేసిందని విమర్శించారు. సుమారు 30 ఎకరాల్లో ఉన్న ఇళ్లను ధ్వంసం చేసి బాధితులను నిలువనీడ లేకుండా చేసిందన్నారు.
వెంటనే ప్రభుత్వం అదే స్థలంలో వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటివరకు బీఆర్‌ఎస్ పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కురాకుల నాగభూషణం, మాజీ సూడా ఛైర్మన్ బచ్చు విజయ్, బత్తుల మురళి, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



