ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతి నిధి)
అక్టోబర్ 18న బీసీ బంద్ సందర్భంగా సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు భూక్యా విజయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి, అక్రమ కేసులపై బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావ్ ఘటన వివరాలు మంత్రికి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్, రాష్ట్ర డిజిపి గారితో మాట్లాడి దాడి కేసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడికి న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన విచారణ జరగాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.


