వాయుగుండం ప్రభావంతో రాబోయే రెండు రోజులలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన
నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని,వారి భద్రతకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి,ప్రజల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలకు వారిని వెంటనే తరలించాలన్నారు.వాగుల వంకల వద్దకు వెళ్ళొద్దన్నారు.ఎలక్ట్రిక్ స్తంభాలు,తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దు.తగినంత త్రాగు నీరు,మందులు,టార్చ్ లైట్లు కొవ్వొత్తులు,పొడి ఆహారం వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.


