పున్నమి ప్రతినిధి
Bharat Nivesh ఆధ్వర్యంలో ‘యంగ్ మైండ్స్’ పేరిట జాతీయ స్థాయి వ్యాస రచనా పోటీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్కు ఆర్థిక సాక్షరత ప్రాముఖ్యత’ అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుందని తెలిపారు. జనవరి 31, 2025 వరకు వ్యాసాలను పంపించవచ్చని, విజేతలకు ఆకర్షణీయ బహుమతులు అందజేస్తామని తెలిపారు.


