సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉండే గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు.
వాస్తవానికి ఇళ్లకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది.
ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు. ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అని శీశీశ్రీ అమరేంద్ర స్వామి వారిని అడుగగా.. ఈ క్రింది విధంగా సెలవిచ్చారు.
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతం గానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గానూ అవతరించారు. ఆ భక్తుల కోసం, వారి కోరిక ప్రకారం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ పర్వత రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా అది ఎంతో పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ గడపకు నమస్కరిస్తారని వేద పండితులు చెబుతారు. అందుకే ఆలయంలోని ప్రధాన గడప తొక్కకూడదని… కేవలం కుడి కాలు ముందు పెట్టి దాటాలని పెద్దలు సూచిస్తున్నారు.
సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉండే గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. వాస్తవానికి ఇళ్లకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు. ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అని శీశీశ్రీ అమరేంద్ర స్వామి వారిని అడుగగా.. ఈ క్రింది విధంగా సెలవిచ్చారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతం గానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయము గానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రి గానూ అవతరించారు. ఆ భక్తుల కోసం, వారి కోరిక ప్రకారం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ పర్వత రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా అది ఎంతో పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ గడపకు నమస్కరిస్తారని వేద పండితులు చెబుతారు. అందుకే ఆలయంలోని ప్రధాన గడప తొక్కకూడదని… కేవలం కుడి కాలు ముందు పెట్టి దాటాలని పెద్దలు సూచిస్తున్నారు.

