పున్నమి ప్రతినిధి)
హిరణ్యవర్ణాం హరిణీమ్ అని అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మినీ పద్మ హస్తే, పద్మాలయే అని అమ్మవారిని కొలుస్తూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ వారి అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు.
బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు- కుంకుమలంటే ఎంతో ప్రీతికరం…
అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది… ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతునే ఉంటాయి….దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం ఆరో అంతస్తులో ఆలయ అర్చకస్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు
పూజలకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉభయ దాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. సౌభాగ్య ప్రధాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్దసంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్తప్రపత్తులు చాటుకున్నారు.. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
జై భవాని… జై జై భవాని

