యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ పలు దుకాణాల పై కి దూసుకెళ్ళింది. ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. రహదారికి అడ్డంగా ఉన్న లారీ నీ క్రేన్ సహాయం తో పోలీసులు తొలగిస్తున్నారు. కాగా లారీ
గజ్వేల్ నుండి భువనగిరి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. బ్రేక్ లు ఫెయిల్ కావటం తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


