అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది బ్రిడ్జిపై నుండి మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జీడిమెట్లలోని సూరారం ప్రాంతానికి చెందిన జయశ్రీ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సంఘటనను గమనించిన కొండపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సాహసంగా నదిలోకి దూకి మహిళను కాపాడారు. వివరాల ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు.

బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళా.
అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది బ్రిడ్జిపై నుండి మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జీడిమెట్లలోని సూరారం ప్రాంతానికి చెందిన జయశ్రీ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సంఘటనను గమనించిన కొండపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సాహసంగా నదిలోకి దూకి మహిళను కాపాడారు. వివరాల ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు.

