ఖమ్మం పున్నమి ప్రతినిధి*భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బోళ్ల బిక్షపతి గారి తండ్రిగారు బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు గురువారం స్వర్గస్తులయ్యారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ గల్లా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది*
*ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ బోళ్ల బిక్షపతి గారి తండ్రి గారు బోళ్ల లక్ష్మయ్య గారి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బోళ్ల బిక్షపతి గారితో పాటు వారి కుటుంబంతో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, బోళ్ల చిన్న లక్ష్మయ్య గారు ఎప్పుడు చూసినా చాలా ఆరోగ్యంగా ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారిని, అదేవిధంగా బోల్ల చిన్న లక్ష్మి గారు వారి చిన్నతనంలో నాటకాల పైన ఉన్న శ్రద్ధతో శ్రీరాముని పాత్ర శ్రీకృష్ణుని పాత్ర పోషించారని, ఇప్పటికీ రామాయణం మహాభారతం గురించి ఈ తరం వారికి వివరిస్తూ ఉండేవారని, అటువంటి మంచి మనిషి ఆకస్మికంగా మరణించడం అత్యంత దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇటువంటి కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు*

