Story highlights
- Uploaded Video:
నెల్లూరు: ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు నగరంలో బైక్‌పై పర్యటిస్తూ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు.ఈ సందర్భంగా మూలాపేటలోని డీఎస్ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Uploaded Video: