బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది విద్యార్థుల ఎంపిక – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట: లక్కీ డ్రా ద్వారా షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద 192 మంది ఎంపికయ్యారని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను 1వ తరగతిలో డే స్కాలర్ కేటగిరీకి 94 మంది, 5వ తరగతి రెసిడెన్షియల్ లో 98 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద రాణి, డీఈఓ అశోక్, రెసిడెన్షియల్ జిల్లా కోఆర్డినేటర్ సి హెచ్ పద్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.