(అమరావతి పున్నమి ప్రతినిధి)
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు సర్వీసును పొడిగించింది. వ్యవసాయ శాఖకు ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయనకు అప్పట్లోనూ సేవల పొడిగింపు లభించింది. తాజా నిర్ణయంతో ఆయన వ్యవసాయం, పట్టు పరిశ్రమ, సహకారం & మార్కెటింగ్ శాఖల బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నెలకు రూ.3.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించనున్నారు.


