పున్నమి ప్రతినిధి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, ఖమ్మం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు కలిసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల హక్కుల సాధన కోసం పార్టీ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా నేతలు నిర్ణయించారు.


