ఖమ్మం ఆగస్టు (పున్నమి ప్రతినిధి )
“చలో బంజారాహిల్స్ పెద్దమ్మ దేవాలయం” కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ బంజార హిల్స్ పెద్దమ్మ దేవాలయము వద్ద హిందూ సంఘాలు తలపెట్టిన అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమం లో భాగంగా ఈరోజు అమ్మవారి దేవాలయం కి వెళుతున్న బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ని మరియు బీజేవైఎం కార్యకర్తలని ఖమ్మం అర్భన్ పోలీస్ లు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. హిందూ దేవాలయాల మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ని బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ తప్పు పట్టారు


