పున్నమి ప్రతి నిధి
(జూబ్లీహిల్స్)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ కు మద్దతుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బోరబండ, ఎర్రగడ్డ డివిజన్‌లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రతిభ కాలేజ్, మోతి నగర్ ఎక్స్ రోడ్, మిద్‌ల్యాండ్ చౌరస్తా మీదుగా రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది.
అడుగడుగునా జన ప్రభంజనం తోడవగా వేలాదిగా తరలివచ్చిన బీజేపీ మద్దతుదారులు ర్యాలీకి విశేష స్పందన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — గత పదేళ్లుగా బీఆర్ఎస్, రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ వచ్చాయని, మజ్లిస్ కనుసన్నల్లో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ ఉపఎన్నికలో ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థి లంకల దీపక్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ ర్యాలీలో గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, గౌరవ నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


