సత్తుపల్లి అక్టోబర్
(పున్నమి ప్రతి నిధి)
తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతుగా సత్తుపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్ అమలుకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. “మతపరమైన రిజర్వేషన్లు తొలగించాలి”, “బీసీలకు న్యాయం చేయాలి” అనే నినాదాలు చేశారు.
ఈ ర్యాలీలో ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇవి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు శాలి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ శ్రేణుల భారీ తరలింపు చూసి తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిన బజారు రౌడీలు — కమల్ పాషా, సందీప్, చెన్నారావు ర్యాలీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాఘవరావు గాయపడ్డారు. బీజేపీ నాయకులు ఈ ఘటనపై సత్తుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు


