పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో BRS తో పాటు వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు రాజీనామా,కాంగ్రెస్ పార్టీలో చేరిక*
మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
బి ఆర్ ఎస్ కి రాజీనామా కాంగ్రెస్ లో చేరిక లు
ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం మంగాపురం తండా గ్రామం నుంచి బి ఆర్ ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీల కు చెందిన ముప్పై కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలోకి వస్తున్న వారికి నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్,కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని వారు తెలిపారు.త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం గా ప్రతి ఒక్కరూ పని చేయాలని వారు అన్నారు. ఈకార్యక్రమంలో మంగాపురం తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీలో పార్టీలో చేరిన వారిలో చినతండ గ్రామ BRS అధ్యక్షులు తేజవతు కోటేశ్వరరావు,మంగాపురం తండా గ్రామ BRS పార్టీ కార్యదర్శి భూక్యా కృష్ణ,భూక్యా సునీల్,పాల్తీయ వేణు గోపాల్, తేజవత్ నాగరాజు,వెంకట,బాణోతూ భాస్కర్,గణేష్,నాగరాజు, తదితరులు ఉన్నారు


