“ఇది నాయకుల ఎన్నిక కాదు… కార్యకర్తల ఎన్నిక!”
* “ప్రతి గ్రామాన్ని బీజేపీ కోటగా మార్చండి.
* “రుణమాఫీ మాయ, పల్లె ప్రగతి గాలిమాట.
* “ఇంటింటికీ మోదీ అభివృద్ధి సందేశం తీసుకెళ్లండి.
* “కార్యకర్తలే పార్టీ విజయానికి పునాది కావాలి.
* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు
• బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఛాలెంజ్‌గా తీసుకొని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన ప్రత్యేక కార్యశాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇది నాయకుల ఎన్నిక కాదు… కార్యకర్తల ఎన్నిక!” అని … గ్రామ అభివృద్ధికి నిధులు వచ్చేది మన ప్రభుత్వాల నుంచే అని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయిలో ప్రతీ స్థానంలో బీజేపీ పోటీచేయాలని, ప్రతి ఓటు జాతీయ అభివృద్ధికి పునాదిగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లండి
గత రెండేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామీణ పాలన పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. “నరేంద్ర మోడీ ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేయకపోతే గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది,” అని గుర్తు చేశారు.
ప్రతి గ్రామానికి వెళ్లి, ఇంటింటికీ చేరి మోదీ ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. బలమైన కార్యాచరణ ద్వారానే బీజేపీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించగలదని స్పష్టం చేశారు. ఈసారి ఓటుతో గ్రామాన్ని గెలిపించాలి… దేశాన్ని ముందుకు నడిపించాలి,” అని ఆయన నినాదం ఇచ్చారు.
*కి“పల్లె ప్రగతి” మాయమాటగా మిగిలింది .
* జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు
కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ కేవలం మాటల్లోనే మిగిలిపోయిందని అన్నారు. ఖమ్మం జిల్లాలో లక్షలాది మంది రైతులు ఇప్పటికీ రెండెకరాలకుపైగా రుణ భారం మోస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు వరి బోనస్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయలేదని, ఎండాకాలంలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటికీ చెల్లింపులు రాకపోవడం సరికొత్త మోసమని చెప్పారు. విత్తనాల విషయంలోనూ నకిలీ విత్తనాలతో వ్యవసాయం దెబ్బతింటోందని, అసలు విత్తనాలు దొరకని పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు.
“వాణిజ్య వర్గాల పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్ కొరతలు, సాగునీటి సమస్యలు గ్రామీణ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మూడుమంది మంత్రులు ఉన్నా కూడా పరిస్థితి యథాతథంగా ఉండడం ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రతిబింబిస్తోంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇందిరమ్మ ఇల్లు, యువశక్తి కార్డులు, రేషన్ పథకాలు వంటి సంక్షేమ పథకాలను కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ద్వారా ప్రభుత్వం దారితప్పిన పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. నిజమైన అర్హులను పట్టించుకోకుండా అనర్హులకు లబ్ధులు చేకూర్చుతున్నారని విమర్శించారు.
“క్షేత్రస్థాయిలో పని చేయండి – గెలుపే లక్ష్యం”
నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ – “ఇప్పటికైనా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. ఇంటింటికీ చేరాలి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, మోసాలను ప్రజలకు వివరించాలి. బీజేపీని ఒక్కొక్క స్థానంలో గెలిపించే దిశగా కృషి చేయాలి,” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యశాలలో జిల్లా కన్వీనర్ ఇవి రమేష్,రాష్ట్ర నాయకులు గెంటాల విద్యాసాగర్ రావు, దొంగలు సత్యనారాయణ,
సన్నీ ఉదయ్ ప్రతాప్,దేవికి వాసుదేవరావు,దిద్దుకూరి వెంకటేశ్వరావు,నున్నా రవి, నంబూరి రామలింగేశ్వరరావు, పుల్లారావు యాదవ్ గార్లు మరియు మండల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా కన్వీనర్లు ప్రబారీలు నాయకులు పాల్గొన్నారు