తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
బిక్కవోలు, 29 నవంబర్ (పున్నమి ప్రతినిధి) :
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా స్థానిక “కూచిపూడి కళాధామం” నాట్యాచారిణి ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మూషిక వాహన, ఆలోకమే శ్రీ, సూర్యాష్టకం, ముద్దుగారే యశోధ, శివాష్టకం, తరంగం, అరయులు కురియగ, పలుకే బంగార, బ్రహ్మమోక్కటే, భామనే సత్యభామనే, గణేష్ పంచరత్నం, చక్కని తల్లికి, పుష్పాంజలి, అఖిలాండేశ్వరి, కులుకుగ నడవరో, బ్రహ్మాంజలి, ఓం నమః శివాయ, నారాయణాయ, మూషిక వాహన – 2, అన్నమయ్య పదాలు వంటి పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్బంగా నాట్యాచారిణి
పి.జాహ్నవి మాట్లాడుతూ కూచిపూడి అనేది మన తెలుగు వారి ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన శాస్త్రీయ నృత్య రీతి. ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు, శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఒక గొప్ప వ్యాయామం మరియు విద్య కూడా. చిన్నప్పటి నుండి పిల్లలు కూచిపూడి నేర్చుకోవడం వల్ల వారిలో అనేక సానుకూల లక్షణాలు అలవడతాయి. వారి వ్యక్తిత్వంలో శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యం, చురుకుదనం, మానసిక వికాసం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ, భావోద్వేగ మరియు సాంస్కృతిక వికాసం, భావ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం, భాష మరియు సంస్కృతి అలవడుతుందని, కూచిపూడి నేర్చుకోవడం అంటే కేవలం డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు, అది ఒక జీవన విధానం ఇది పిల్లలను శారీరకంగా బలవంతులుగా, మానసికంగా విజ్ఞులుగా, మరియు సాంస్కృతికంగా సంపన్నులుగా తీర్చిదిద్దుతుందిని తెలియజేసారు. షష్టి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లి శ్రీనివాస రెడ్డి నాట్యాచారిణి పి.జాహ్నవిని సత్కరించి, చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాలచర్ల శివ ప్రసాద్ చౌదరి, చాగంటి సాయిబాబా రెడ్డి, పల్లి రాజా రెడ్డి, నందిపాటి కిషోర్ పాల్గొన్నారు.


