Monday, 23 March 2026
  • Home  
  • బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక” లలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి
- తూర్పు గోదావరి

బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక” లలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 4 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : ముప్పిడి సామ్యూల్ రాజ్ మెమోరియల్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక” లలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ… ఈరోజు ఫ్యామిలీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి స్టేజి పైనున్న సంఘ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందస్తు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం డిసెంబర్ మాసం వచ్చిందంటే మనకు క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. నెల రోజులపాటుగా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకొని జనవరి ఒకటవ తేదీతో ఈ కార్యక్రమాలను ముగించుకోవడం జరుగుతుంది. ఎందువలన ఈ నెల రోజులపాటు నిర్వహించుకుంటామనేది అందరికీ తెలిసిన విషయమే క్రీస్తు అంటేనే వెలుగుకి చిహ్నం, ఒక వెలుగు చూపించడం కోసం, మానవాళిని రక్షించటం కోసం ఆయన అవతరించారనే సంగతి మన అందరికీ విధితమే. ముఖ్యంగా అతి తక్కువ కాలం జీవించిన వ్యక్తి కానీ అతి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తు అని మాత్రం చెప్పక తప్పదు. ఎందువలన అంటే ఆయన ప్రభావం ఎంత పెద్దగా ఉంది అని అంటే ఈరోజుకి కూడా మనం కాలాన్ని గణించేది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఆధారంగానే మనం కాలాన్ని గణిస్తున్నాము. దీన్ని ప్రపంచమంతా పాటిస్తుంది అంత ప్రభావం చూపించిన మరొక వ్యక్తి లేరు. ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన మానవాళి జీవన విధానం ఎలా ఉండాలో బోధించడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపించిన వ్యక్తి అనేది మనమందరం తెలుసుకోవాల్సిన విషయం, వారు అనేక బోధనలు చేశారు ఆయన అనేక కష్టాలను అనుభవించారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా ఓర్పు, సహనం కోల్పోకుండా ప్రేమతో మానవుడు ఉండాలి అని ఉద్బోధించిన మహానుభావుడు క్రీస్తు అని చెప్పక తప్పదు. ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలం జీవించి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. ఒకటి క్రీస్తు అయితే రెండు స్వామి వివేకానంద మూడు ఆది శంకరాచార్యులు ఈ ముగ్గురూ కూడా దగ్గర దగ్గరగా 33, 34, 35 సంవత్సరాల లోపే వారు కాలం చేయడం జరిగింది. కానీ అందరినీ మించి క్రీస్తు ప్రభావం ప్రపంచమంతా చూపించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయన అంత తక్కువ కాలంలో మనపై ఏ విధంగా ప్రభావం చూపించారు అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి వారి బోధనలను ఇవాళ సంఘంలో ఉన్న పెద్దలు మానవులకు తెలియజేస్తూ మానవాళిలో ఒక జీవన విధానంలో మార్పు తీసుకుని రావాలి అందరూ ప్రేమగా సహనంతో ఓర్పుతో ఉండాలి పరులకు సహాయం చేయాలి అనే విషయాలని మీ అందరిలో నింపడం కోసం వారు తీవ్రమైన కృషి చేయడం జరుగుతుంది అటువంటి సందర్భంలో వారు చేస్తున్నటువంటి కృషికి నిజంగా ఈ సమాజం అంతా వారికి చేతులెత్తి ప్రణామం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియచేసినారు. ఎన్నికల ముందు సంఘ పెద్దలందరిని విజయరావు గారు ఒకచోటకు చేర్చారు దాదాపు 450 – 500 మంది సంఘ పెద్దలను ఒకచోటకు చేర్చారు, ఆరోజు సమావేశానికి రావడం జరిగింది బహుశా అది నా అదృష్టమని భావిస్తున్నాను. ఎందువలన అంటే ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సమావేశానికి క్రీస్తు సంఘ పెద్దలు 500 మంది హాజరు కావడం అనేది బహుశా భారత దేశ చరిత్రలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం అని నేను భావిస్తున్నాను. అటువంటి గౌరవాన్ని సంఘ పెద్దలు అందరూ నాకు ఇచ్చారు, దానికి ముఖ్యమైన కారకులు మా విజయరావు గారు. ఆరోజు స్పష్టంగా నేను ఒకటే చెప్పడం జరిగింది నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను భారతదేశ రాజ్యాంగం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసేటప్పటికి ఒక ప్రమాణం చేస్తారు, ఆ ప్రమాణం ఏంటంటే లౌకిక విధానానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశా. అదేవిధంగా ఒకవేళ నేను శాసనసభ్యునిగా ఎన్నికైనట్లయితే శాసనసభలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని నేను ప్రమాణం చేసి బాధ్యతలను తీసుకుంటాను. భారత రాజ్యాంగం అంటే లౌకిక విధానం అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గాని నేను చేసేటప్పుడు శాసనసభ్యుడిగా నేను నా విధి నిర్వహణను నిర్వర్తించాలి తప్ప వేరే విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉండదు అని వారికి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను 2014-19 మధ్య కాలంలో శాసనసభ్యునిగా ఉండగా కూడా లేదా అంతకుముందు మా తండ్రిగారు నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు. శాసనసభ్యులుగా ఉండగా మేము ఏ విధంగా ప్రవర్తించాం ఏ విధంగా మా విధానాలు ఉన్నాయని ఈ పెద్దలందరికీ తెలుసు, కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇవ్వటంతో అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి 20 వేల మెజారిటీతో గెలవడం అంటే అది మీ అందరి వల్ల సాధ్యమైంది అని మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు మరొకమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశానికి రమ్మని ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.

బిక్కవోలు, 4 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) :

ముప్పిడి సామ్యూల్ రాజ్ మెమోరియల్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక” లలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ…

ఈరోజు ఫ్యామిలీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి స్టేజి పైనున్న సంఘ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందస్తు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం డిసెంబర్ మాసం వచ్చిందంటే మనకు క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. నెల రోజులపాటుగా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకొని జనవరి ఒకటవ తేదీతో ఈ కార్యక్రమాలను ముగించుకోవడం జరుగుతుంది. ఎందువలన ఈ నెల రోజులపాటు నిర్వహించుకుంటామనేది అందరికీ తెలిసిన విషయమే క్రీస్తు అంటేనే వెలుగుకి చిహ్నం, ఒక వెలుగు చూపించడం కోసం, మానవాళిని రక్షించటం కోసం ఆయన అవతరించారనే సంగతి మన అందరికీ విధితమే.
ముఖ్యంగా అతి తక్కువ కాలం జీవించిన వ్యక్తి కానీ అతి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తు అని మాత్రం చెప్పక తప్పదు.

ఎందువలన అంటే ఆయన ప్రభావం ఎంత పెద్దగా ఉంది అని అంటే ఈరోజుకి కూడా మనం కాలాన్ని గణించేది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఆధారంగానే మనం కాలాన్ని గణిస్తున్నాము.
దీన్ని ప్రపంచమంతా పాటిస్తుంది అంత ప్రభావం చూపించిన మరొక వ్యక్తి లేరు. ఒక ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

ఆయన మానవాళి జీవన విధానం ఎలా ఉండాలో బోధించడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపించిన వ్యక్తి అనేది మనమందరం తెలుసుకోవాల్సిన విషయం, వారు అనేక బోధనలు చేశారు ఆయన అనేక కష్టాలను అనుభవించారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఎక్కడా ఓర్పు, సహనం కోల్పోకుండా ప్రేమతో మానవుడు ఉండాలి అని ఉద్బోధించిన మహానుభావుడు క్రీస్తు అని చెప్పక తప్పదు.

ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలం జీవించి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు. ఒకటి క్రీస్తు అయితే రెండు స్వామి వివేకానంద మూడు ఆది శంకరాచార్యులు ఈ ముగ్గురూ కూడా దగ్గర దగ్గరగా 33, 34, 35 సంవత్సరాల లోపే వారు కాలం చేయడం జరిగింది. కానీ అందరినీ మించి క్రీస్తు ప్రభావం ప్రపంచమంతా చూపించే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆయన అంత తక్కువ కాలంలో మనపై ఏ విధంగా ప్రభావం చూపించారు అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది.

మరి వారి బోధనలను ఇవాళ సంఘంలో ఉన్న పెద్దలు మానవులకు తెలియజేస్తూ మానవాళిలో ఒక జీవన విధానంలో మార్పు తీసుకుని రావాలి అందరూ ప్రేమగా సహనంతో ఓర్పుతో ఉండాలి పరులకు సహాయం చేయాలి అనే విషయాలని మీ అందరిలో నింపడం కోసం వారు తీవ్రమైన కృషి చేయడం జరుగుతుంది అటువంటి సందర్భంలో వారు చేస్తున్నటువంటి కృషికి నిజంగా ఈ సమాజం అంతా వారికి చేతులెత్తి ప్రణామం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియచేసినారు.

ఎన్నికల ముందు సంఘ పెద్దలందరిని విజయరావు గారు ఒకచోటకు చేర్చారు దాదాపు 450 – 500 మంది సంఘ పెద్దలను ఒకచోటకు చేర్చారు, ఆరోజు సమావేశానికి రావడం జరిగింది బహుశా అది నా అదృష్టమని భావిస్తున్నాను. ఎందువలన అంటే ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సమావేశానికి క్రీస్తు సంఘ పెద్దలు 500 మంది హాజరు కావడం అనేది బహుశా భారత దేశ చరిత్రలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం అని నేను భావిస్తున్నాను.

అటువంటి గౌరవాన్ని సంఘ పెద్దలు అందరూ నాకు ఇచ్చారు, దానికి ముఖ్యమైన కారకులు మా విజయరావు గారు. ఆరోజు స్పష్టంగా నేను ఒకటే చెప్పడం జరిగింది నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను భారతదేశ రాజ్యాంగం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసేటప్పటికి ఒక ప్రమాణం చేస్తారు, ఆ ప్రమాణం ఏంటంటే లౌకిక విధానానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేశా.

అదేవిధంగా ఒకవేళ నేను శాసనసభ్యునిగా ఎన్నికైనట్లయితే శాసనసభలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని నేను ప్రమాణం చేసి బాధ్యతలను తీసుకుంటాను.
భారత రాజ్యాంగం అంటే లౌకిక విధానం అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం వహించే రాజ్యాంగం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గాని నేను చేసేటప్పుడు శాసనసభ్యుడిగా నేను నా విధి నిర్వహణను నిర్వర్తించాలి తప్ప వేరే విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉండదు అని వారికి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది.

నేను 2014-19 మధ్య కాలంలో శాసనసభ్యునిగా ఉండగా కూడా లేదా అంతకుముందు మా తండ్రిగారు నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు. శాసనసభ్యులుగా ఉండగా మేము ఏ విధంగా ప్రవర్తించాం ఏ విధంగా మా విధానాలు ఉన్నాయని ఈ పెద్దలందరికీ తెలుసు, కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇవ్వటంతో అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి 20 వేల మెజారిటీతో గెలవడం అంటే అది మీ అందరి వల్ల సాధ్యమైంది అని మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఆ విధంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు మరొకమారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశానికి రమ్మని ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, బిక్కవోలు మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.