Wednesday, 25 March 2026
  • Home  
  • బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
- తిరుపతి

బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. బాహుబలి రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. షార్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి, LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. సాయంత్రం 5.26 గంటలకు షార్‌లోని రెండో లాంచ్‌ పాడ్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ GTOలోకి ప్రవేశపెట్టారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సీఎంఎస్‌-03 ఉపగ్రహం.. కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగింది.. ఆ తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది బాహుబలి రాకెట్‌. ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది.. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. CMS-03 ఎందుకంత స్పెషల్..? ప్రయోగించిన రాకెట్టూ స్పెషలే.. అందులో ప్రయాణించి కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన శాటిలైట్ కూడా స్పెషలే. బాహుబలి1, బాహుబలి2 అని చెప్పుకోవచ్చు. ఇంతకీ CMS-03 ఎందుకంత స్పెషల్..? >>4,400 కేజీలు బరువు కలిగిన CMS-03 భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నారు. >>CMS-03.. దీనికి GSAT-7R అని మరో పేరుంది. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. >>ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడ్డంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. >>గతంలో జీశాట్-7 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. దీని కాలపరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT-7R శాటిలైట్‌ను రూపొందించి, నింగికి పంపారు. >>భారత భూ భాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్‌ ఈ బాహుబలి రాకెట్‌ అండ్‌ బాహుబలి శాటిలైట్‌ ప్రయోగం నేపథ్యంలో, తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్‌ దర్శించుకున్నారు. శాటిలైట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు చెల్లించారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. బాహుబలి రాకెట్‌ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. షార్‌లోని రెండో లాంచ్ పాడ్ నుంచి, LVM 03-M5 రాకెట్‌ని ప్రయోగించారు. ఈ రాకెట్‌ ద్వారా, తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. సాయంత్రం 5.26 గంటలకు షార్‌లోని రెండో లాంచ్‌ పాడ్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ GTOలోకి ప్రవేశపెట్టారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సీఎంఎస్‌-03 ఉపగ్రహం.. కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగింది.. ఆ తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది బాహుబలి రాకెట్‌. ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది.. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది.

CMS-03 ఎందుకంత స్పెషల్..?
ప్రయోగించిన రాకెట్టూ స్పెషలే.. అందులో ప్రయాణించి కక్ష్యలోకి ఎంట్రీ ఇచ్చిన శాటిలైట్ కూడా స్పెషలే. బాహుబలి1, బాహుబలి2 అని చెప్పుకోవచ్చు. ఇంతకీ CMS-03 ఎందుకంత స్పెషల్..?

>>4,400 కేజీలు బరువు కలిగిన CMS-03 భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నారు.

>>CMS-03.. దీనికి GSAT-7R అని మరో పేరుంది. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది.

>>ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడ్డంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.

>>గతంలో జీశాట్-7 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. దీని కాలపరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT-7R శాటిలైట్‌ను రూపొందించి, నింగికి పంపారు.

>>భారత భూ భాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్‌
ఈ బాహుబలి రాకెట్‌ అండ్‌ బాహుబలి శాటిలైట్‌ ప్రయోగం నేపథ్యంలో, తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్‌ దర్శించుకున్నారు. శాటిలైట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు చెల్లించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.