పున్నమి ప్రతి నిధి
(పువ్వాడ నాగేంద్ర కుమార్)
తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి గారు మృతి చెందారు. ఈమె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


