పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 29 ఫిర్యాదులు.. రెవెన్యూ శాఖ -13, ఇతర శాఖలు 16, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 29 ఫిర్యాదులు అందాయి.ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వినిపిస్తూ అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.రెవెన్యూ శాఖకు 13,ఇతర శాఖలకు 16, మొత్తం 29 దరఖాస్తులు అందాయని తెలిపారు.అనంతరం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్,సంక్షేమ హాస్టళ్లు గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలి,పత్తి,వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.తరువాత కలెక్టర్ బాల్యవివాహాలను ఆపండి పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి,జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, మండల తహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.

బాల్యవివాహాలను ఆపండి పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.