భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు బాల అకాడమీ పాఠశాల, నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం సంయుక్తంగా బాల అకాడమీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యురాలు డాక్టర్ నాగమణి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ రాష్ట్ర మహిళా వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజలు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా బాల అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాలల సృజనాత్మక శక్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ,పాఠశాల యాజమాన్యాలపై,
అధ్యాపకులపై ఉన్నదని గుర్తు చేశారు. బాలలు గొప్ప జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం పట్టుదలతో, అంకితభావంతో, సమయపాలన పాటిస్తూ, నిరంతర కృషి చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
డాక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ బాలలు చదువుతోపాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం అవసరమన్నారు.
డాక్టర్ సునీత మాట్లాడుతూ బాలలు క్రమశిక్షణతో మెలుగుతూ, తోటివారిపట్ల స్నేహభావం కలిగి అవసరమైనప్పుడు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు.
డాక్టర్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ గేమ్స్ కు, హానికరమైన చిరు తిండ్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలని కోరారు.
బాలల దినోత్సవం పురస్కరించుకుని బాలల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీ విజేతలకు నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం తరపున బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థులు,అధ్యాపక బృందం పాల్గొన్నారు.

బాలల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం: నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి*
భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు బాల అకాడమీ పాఠశాల, నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం సంయుక్తంగా బాల అకాడమీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యురాలు డాక్టర్ నాగమణి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ రాష్ట్ర మహిళా వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాల అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాలల సృజనాత్మక శక్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ,పాఠశాల యాజమాన్యాలపై, అధ్యాపకులపై ఉన్నదని గుర్తు చేశారు. బాలలు గొప్ప జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం పట్టుదలతో, అంకితభావంతో, సమయపాలన పాటిస్తూ, నిరంతర కృషి చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. డాక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ బాలలు చదువుతోపాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం అవసరమన్నారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ బాలలు క్రమశిక్షణతో మెలుగుతూ, తోటివారిపట్ల స్నేహభావం కలిగి అవసరమైనప్పుడు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ గేమ్స్ కు, హానికరమైన చిరు తిండ్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలని కోరారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని బాలల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీ విజేతలకు నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం తరపున బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థులు,అధ్యాపక బృందం పాల్గొన్నారు.

