
- అసలే పేదరికం.. ఆపై అరుదైన వ్యాధి
- ఇంటికి వెళ్లి పరామర్శించి ఓదార్చిన వాసుపల్లి
- ఉచిత మెడిసిన్, పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరిన మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఎస్ ఎల్ ఈ సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమాటసస్ బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న దౌలపిల్లి పావని(23) కి మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 5000 మెడికల్ ఖర్చులకు అందజేశారు. 34వ వార్డు కార్పొరేటర్ తోట పద్మావతి ద్వారా విషయం తెలుసుకొని 34వ వార్డు కొబ్బరి తోటలో ఉంటున్న ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. డెలివరీ అయినప్పటినుండి భరించలేని బాడీపెయిన్స్ తో మంచాన పడింది. భర్త కూడా విడిచి వెళ్లిపోవడంతో ఆమె తల్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మెడికల్ ఖర్చులు కూడా భరించలేని స్థితిలో ఉండగా గతంలో వాసుపల్లి సాయం అందించారు. మరోసారి ఆమె ఇంటికి వెళ్లి సొంత నిధులతో రూ. 5000 సహాయం చేశారు.
చిన్న వయసులోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ప్రభుత్వం చేయూత అందించాలన్నారు. మెడిసిన్ ఖర్చులకు నెలకు 12000 ఖర్చు అవుతుందని, ఈ మందులను కేజీహెచ్ ద్వారా ఉచితంగా అందజేయాలని వాసుపల్లి కోరారు. ఇతర అరుదైన వ్యాధులకు మంజూరు చేసిన విధంగా ఈమెకు నెలకు 10,000 పెన్షన్ మంజూరు చేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు . కార్యక్రమంలో 34వ వార్డ్ కార్పొరేటర్ తోటపద్మావతి,లింగం శ్రీను, లండ రమణ, జిల్లా వాలంటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు, జిల్లా స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్,అంబతి అప్పలరాజు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్,33వ వార్డ్ అధ్యక్షులు ముత్తాబత్తులరమేష్,రామరాజు, సూర్య వార్డ్ నాయకులు తదితరులు పాల్గున్నారు.

