– ముగ్గురు నిందితులు అరెస్ట్
కామారెడ్డి, 19 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పోలీసులు వాహనాలు చెక్ చేస్తుంటే.. షాక్!ఆదివారం ఇద్దరు అనామకులు బైక్‌పై వచ్చి, పోలీసుల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించా రు. వెంబడించి పట్టుకుని విచారించగా.. భూకం పం బద్దలు కొట్టినట్లైంది.అనుమతి లేని 50 జిలటి న్ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 52 మీ. వైర్లు బయట పడ్డా యి.విచారణలో వివరాలు..గర్గుల్ గ్రామానికి చెందిన రాజు, చత్తీస్‌ఘడ్ చౌకి, పనర్వాణి శేషు లాల్ – ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. జామాబాద్ వరికుప్పల నర్సింహుల నుంచి కొనుగోలు చేసి, గాంధారి మండల బండ రాళ్లు పేల్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది. నర్సింహు ల వద్ద 5 వేలకు పైగా జిలటిన్ స్టిక్స్ మ్యాగజిన్లు వారి వద్ద ఉన్నట్లు బయట పడ్డాయి. పోలీసుల స్వాధీనం: బైక్, మొబైల్స్, నర్సింహు వద్ద 20 స్టిక్స్, 4 డిటోనేటర్లు, లాగ్ బుక్స్. లైసెన్స్ ధారీ ఒరుసు సాయి మల్లు పరారీ – టాప్ టార్గెట్!ఎస్పీ గట్టి అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పి రాజేష్ చంద్ర హెచ్చరించారు


