రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణకు బలిజ సేన ఆధ్వర్యంలో ఘన సత్కారం లభించింది. గురువారం చిట్వేల్ మండలంలో బలిజ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి మస్తాన్ రాయులు ఆహ్వానం మేరకు, అన్నమయ్య జిల్లా బలిజ సేన అధ్యక్షులు కే.ఎస్. నరసింహ, బలిజ సేన చిట్వేల్ కార్యాలయంలో అతికారి కృష్ణకు శాలువాలు కప్పి, మెమెంటో అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అతికారి కృష్ణ, “ఒకరికొకరు తోడుగా నిలిచి ఐక్యతగా ముందుకు నడిస్తేనే నిజమైన బలం ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో ఉన్న శక్తి కంటే కలిసినప్పుడు వచ్చే శక్తే అభివృద్ధికి మార్గం చూపుతుంది” అని తెలిపారు. చిట్వేల్ మండల ప్రజల ఆదరాభిమానాన్ని మరువలేనని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అబ్బిగారి గోపాల్, మాదాసు శివ, మైనార్టీ నాయకుడు రియాజ్, మద్దూరి మన్మధ, మిత్రబృందం జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


