Monday, 23 March 2026
  • Home  
  • *బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి?*
- ఖమ్మం

*బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి?*

*బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి?* పున్నమి: ప్రతినిథి ఖమ్మం T.Ravinder ఖమ్మం. తెలంగాణలో ఆదివారం నుండి బతుకమ్మ సంబ రాలు మొదలు అయిన నేపథ్యంలో బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వివాహిత శెట్టి మౌనిక(32) ఉదయం నుండి ఇద్దరు కూతుర్లు, కొడుకుతో కలిసి ఎంతో ఆనందంతో తీరొక పూలను తెంపుకొచ్చి ఆ పూలతో బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో కుటుంబ సభ్యులతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది,

*బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి?*

పున్నమి: ప్రతినిథి
ఖమ్మం
T.Ravinder
ఖమ్మం.
తెలంగాణలో ఆదివారం నుండి బతుకమ్మ సంబ రాలు మొదలు అయిన నేపథ్యంలో బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది.

విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వివాహిత శెట్టి మౌనిక(32) ఉదయం నుండి ఇద్దరు కూతుర్లు, కొడుకుతో కలిసి ఎంతో ఆనందంతో తీరొక పూలను తెంపుకొచ్చి ఆ పూలతో బతుకమ్మను పేర్చింది.

సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో కుటుంబ సభ్యులతో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదఛాయలు
అలుముకున్నాయి. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.