కనిగిరి: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగ పల్లి పై దాడి చేసి శ్రీనివాస్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని ప్రకాశం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పందిటి మోహన్ డిమాండ్ చేశారు.
మంగళవారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోలేదు నేడు మాదిగ పల్లె కర్రలతో కత్తులతో దాడి జరిగిందని ఇది ఎంత మాత్రం సహించరానిదని శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి ఇతర పెత్తందారులు చెందిన గొర్రెలు ధ్వంసం చేస్తే దానిపై మాదిగ పల్లె చెందిన వారు ఫిర్యాదు చేయగా సిఐ కానిస్టేబుల్ ను పంపించి ఎంక్వయిరీ చేస్తుండగా కానిస్టేబుల్ సమక్షంలోనే మాదిగ పల్లెపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని సుమోటోగా స్వీకరించి వెంటనే వారిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదుచేయాలని స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో ఇటువంటి అల్లర్లు ఏదో ఒక మూలన జరుగుతున్నాయని మేధావులు కులం ఎక్కడుంది స్వతంత్ర భారతదేశంలో కులం లేదంటూ పెద్దపెద్ద సూక్తులు చెబుతున్నా మేధావులకు ఇది కనువిప్పు కావాలని దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

బండ్లమూడి మాదిగ పల్లె పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
కనిగిరి: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగ పల్లి పై దాడి చేసి శ్రీనివాస్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని ప్రకాశం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పందిటి మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోలేదు నేడు మాదిగ పల్లె కర్రలతో కత్తులతో దాడి జరిగిందని ఇది ఎంత మాత్రం సహించరానిదని శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి ఇతర పెత్తందారులు చెందిన గొర్రెలు ధ్వంసం చేస్తే దానిపై మాదిగ పల్లె చెందిన వారు ఫిర్యాదు చేయగా సిఐ కానిస్టేబుల్ ను పంపించి ఎంక్వయిరీ చేస్తుండగా కానిస్టేబుల్ సమక్షంలోనే మాదిగ పల్లెపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని సుమోటోగా స్వీకరించి వెంటనే వారిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదుచేయాలని స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో ఇటువంటి అల్లర్లు ఏదో ఒక మూలన జరుగుతున్నాయని మేధావులు కులం ఎక్కడుంది స్వతంత్ర భారతదేశంలో కులం లేదంటూ పెద్దపెద్ద సూక్తులు చెబుతున్నా మేధావులకు ఇది కనువిప్పు కావాలని దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

