Tuesday, 24 March 2026
  • Home  
  • బంటుమిల్లి లో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం లో పాల్గొన్న AICC సెక్రటరీ సంజయ్ దత్ గారు
- ఆంధ్రప్రదేశ్

బంటుమిల్లి లో సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం లో పాల్గొన్న AICC సెక్రటరీ సంజయ్ దత్ గారు

రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ, మహారాష్ట్ర కో ఇంచార్జ్ &SSA అబ్జర్వర్ శ్రీ సంజయ్ దత్ గారు బంటుమిల్లి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ పెడన ఇంచార్జ్ సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ దత్ గారు మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం విధానాలను ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. అలాగే ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై గళ మెత్తే పరిస్థితి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేటప్పటికీ పెట్రోలు, డీజిల్, గ్యాస్,కూరగాయలు, బియ్యము తదితర నిత్యవసర వస్తువుల రేట్లు తక్కువగా ఉండేవని ఇప్పుడు వాటి ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు కొనలేని మరియు బ్రతకలేని పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత నిస్తుందని రాబోయే ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని వర్గాల ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు అవసరమైన సలహాలు సూచనలు, అభిప్రాయాలను అయన సేకరించారు.

రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ సెక్రటరీ, మహారాష్ట్ర కో ఇంచార్జ్ &SSA అబ్జర్వర్ శ్రీ సంజయ్ దత్ గారు బంటుమిల్లి విచ్చేశారు.

కాంగ్రెస్ పార్టీ పెడన ఇంచార్జ్ సొంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ దత్ గారు మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం విధానాలను ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు.

అలాగే ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై గళ మెత్తే పరిస్థితి కూడా లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేటప్పటికీ పెట్రోలు, డీజిల్, గ్యాస్,కూరగాయలు, బియ్యము తదితర నిత్యవసర వస్తువుల రేట్లు తక్కువగా ఉండేవని ఇప్పుడు వాటి ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు కొనలేని మరియు బ్రతకలేని పరిస్థితికి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత నిస్తుందని రాబోయే ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని వర్గాల ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు అవసరమైన సలహాలు సూచనలు, అభిప్రాయాలను అయన సేకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.