*బంగ్లాదేశ్డిసెంబర్ 23 (విశాఖ పున్నమి ప్రతినిధి)*
బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర మత్స్యకారులు 9 మంది విడుదల కోసం అత్యంత ప్రమాదకర పరిస్థితులలో బంగ్లాదేశ్ వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాసుపల్లి జానకిరామ్
బంగ్లాదేశ్ జైల్లో ఉన్న మత్యకారులను కలవటానికి ప్రయత్నాలు చేసిన వాసుపల్లి జానకిరామ్. బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి భారతీయ మత్స్యకారులను ఎవరిని కలవకూడదు అని బంగ్లాదేశ్ కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇవ్వటం వలన మత్స్యకారులు కలవడానికి అనుమతి నిరాకరించిన బంగ్లాదేశ్ బాగర్ హాట్ కేంద్ర కారాగార పోలీసులు.
జైల్లో ఉన్న మత్స్యకారులకు ఆహారం మరియు నిత్యవసర వస్తువుల కొరకు కొంత బంగ్లాదేశ్ కరెన్సీ ని జైల్లో డిపాజిట్ చేసిన వాసుపల్లి జానకిరామ్. జైల్లో ఉన్న మత్స్యకారులకు బంగ్లాదేశ్ కరెన్సీ నెల నుంచి నెలన్నర వరకు వారి అవసరాలకు ఉపయోగపడతాయని తెలియజేసిన జానకి రామ్.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇబ్బందికర వాతావరణం ఉండటం జైలు అధికారులు వీడియో తీయటానికి కూడా నిరాకరించినట్లుగా తెలియజేశారు. అయినా బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వటం కోసం జైలు దగ్గర వీడియో చిత్రీకరణ.
బంగ్లాదేశ్ జిల్లా కోర్టులో కేసు వివరాలు పై సమావేశం
బంగ్లాదేశ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి కోసం బంగ్లాదేశ్ డాఖాలో సుప్రీంకోర్టు అడ్వకేట్ మహమ్మద్ రహ్మాన్ ద్వారా మత్స్యకారుల విడుదల కోసం ప్రయత్నాలు.
బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారత విదేశాంగ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన వాసుపల్లి జానకిరామ్.
భారత విదేసాంగ శాఖ అధికారులు జైలులో ఉన్న మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి పై జైలుకు వెళ్లి మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. చలికాలం కావడం వల్ల అభ్యర్థన మేరకు జైల్లో ఉన్న మత్స్యకారులకు స్వెటర్లు అందజేసిన అధికారులు.
ప్రస్తుతం మత్స్యకారులు అందరు కూడా క్షేమంగా ఉన్నారని జైల్లో ఉన్నామనే బాధ, కుటుంబాలకు దూరంగా ఉన్నామని బాధ ఆవేదన వారు వ్యక్తం చేశారని ఆరోగ్యంగా ఉన్నట్లుగా వారి కుటుంబాలకి తెలియజేయాలని జైల్లో ఉన్నవారు కోరినట్లుగా జానకిరామ్ కు తెలియజేసినటువంటి భారత విదేశాంగ శాఖ అధికారులు.
మత్స్యకారులు విడుదల కోసం సంబంధిత కేసు వివరాలు డాక్యుమెంట్స్ ను భారత విదేశాంగ శాఖ, బాంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖకు అందజేసిన వాసుపల్లి జానకిరామ్.
ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని అల్లర్లు జరుగుతున్నాయని దేశమంతా వాతావరణం అనిర్చితి వాతావరణం ఉందని, హిందువుల పై దాడులు జరుగుతున్నాయని, ప్రధానంగా భారతదేశాన్ని భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉండి ఎక్కడికక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయని చాలా భయానక వాతావరణం ఉందని ప్రస్తుతం తెలియజేసిన వాసుపల్లి జానకిరామ్.
హిందువులు భారతీయులు అధిక సంఖ్యలో వీసా అనుమతి ఉన్నవారు దగ్గరలో ఉన్న భారత సరిహద్దులకు ప్రాణ భయంతో చేరుకుంటున్నారని, చదువుకోడానికి బంగ్లాదేశ్ వచ్చినటువంటి భారతీయ విద్యార్థులు కూడా హాస్టల్స్ ఖాళీ చేసి భారతదేశానికి బయలుదేరుతున్నట్లుగా వివరించిన వాసుపల్లి జానకిరామ్


