Sunday, 7 December 2025
  • Home  
  • ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బూటకపు వ్యవసాయ ప్రణాళికను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలీ.
- తూర్పు గోదావరి

ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమైన బూటకపు వ్యవసాయ ప్రణాళికను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలీ.

అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐ కె ఎం ఎస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు టీ.ప్రకాష్ అధ్యక్షతన 2025 అక్టోబర్ 25,26 తేదీలలో రెండు రోజులపాటు రాజమహేంద్రవరంలో స్థానిక కా.మావో భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ అధ్యక్షులు పి.టాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా అమలు చేస్తోందని, అంబానీ, అదానీ వంటి కార్పోరేట్ శక్తుల ప్రయోజనాలే పరమావధిగా మారాయని విమర్శించారు. కార్మిక రంగం, వ్యవసాయ రంగంలో నేటి వరకు అమలు జరుగుతున్న 36 కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల పథకాలను రద్దు చేసి ఒకే ఒక ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పేరుతో బూటకపు వ్యవసాయ ప్రణాళికను తీసుకు రావడం రైతాంగానికి నష్టకరమని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనీ అన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలతో వ్యవసాయ,పౌల్ట్రీ,పాడి, ఆక్వా రంగాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని అన్నారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ సర్కార్ లొంగి పోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను,ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ ను తీసుకు వచ్చి లక్షలాది మంది పారా మిలటరీ బలగాలతో మావోయిస్టులపై దాడులు చేస్తుందని దుయ్య బట్టారు. సుమారు 500 మందిని బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య గావించి, నరమేధం సాగిస్తుందని అన్నారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపి వేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని టాన్యా డిమాండ్ చేశారు. ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టీ. ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు వేలాది ఎకరాల భూములను కారుచౌకగా కట్టబెట్టడు తుందని ఆరోపించారు. విశాఖ జిల్లా పెద్ద గంట్యాడలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం, మసానా పుట్టిలో 32 వేల మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం,పశ్చిమ గోదావరి జిల్లా జీలుగు మండలం వంకావారి గూడెంలో 1160 ఎకరాల భూములను ఇండియన్ నేవీ, అణ్వాయుధాల ఫ్యాక్టరీ నిర్మాణానికి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. పర్యావరణాన్ని, ప్రజల జీవితాలను ధ్వంసం చేసే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలు, తుపాన్లు కారణంగా పంటలు నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అధిక వర్షాలు, తుపాన్లు కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని, వరి, ప్రత్తి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు తదితర పంటలకు మద్దతు ధరలు కల్పించి కొనుగోలు చేయాలని, కౌలు రైతులు అందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు, అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 నుంచి 12 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. దూలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. కూర్మారావు, కోశాధికారి వి.చిట్టిబాబు రాష్ట్ర నాయకులు కె. బాలు దొర, బాల్ రెడ్డి, ఎన్. పోతురాజు, బాల సుందరం తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐ కె ఎం ఎస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు టీ.ప్రకాష్ అధ్యక్షతన 2025 అక్టోబర్ 25,26 తేదీలలో రెండు రోజులపాటు రాజమహేంద్రవరంలో స్థానిక కా.మావో భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏ ఐ కె ఎం ఎస్ జాతీయ అధ్యక్షులు పి.టాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రైతాంగ, కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా అమలు చేస్తోందని, అంబానీ, అదానీ వంటి కార్పోరేట్ శక్తుల ప్రయోజనాలే పరమావధిగా మారాయని విమర్శించారు. కార్మిక రంగం, వ్యవసాయ రంగంలో నేటి వరకు అమలు జరుగుతున్న 36 కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల పథకాలను రద్దు చేసి ఒకే ఒక ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పేరుతో బూటకపు వ్యవసాయ ప్రణాళికను తీసుకు రావడం రైతాంగానికి నష్టకరమని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనీ అన్నారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలతో వ్యవసాయ,పౌల్ట్రీ,పాడి, ఆక్వా రంగాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని అన్నారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ సర్కార్ లొంగి పోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ వనరులను,ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ ను తీసుకు వచ్చి లక్షలాది మంది పారా మిలటరీ బలగాలతో మావోయిస్టులపై దాడులు చేస్తుందని దుయ్య బట్టారు. సుమారు 500 మందిని బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య గావించి, నరమేధం సాగిస్తుందని అన్నారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపి వేసి, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని టాన్యా డిమాండ్ చేశారు.
ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు టీ. ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు మాట్లాడుతూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు వేలాది ఎకరాల భూములను కారుచౌకగా కట్టబెట్టడు తుందని ఆరోపించారు. విశాఖ జిల్లా పెద్ద గంట్యాడలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి, శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం, మసానా పుట్టిలో 32 వేల మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం,పశ్చిమ గోదావరి జిల్లా జీలుగు మండలం వంకావారి గూడెంలో 1160 ఎకరాల భూములను ఇండియన్ నేవీ, అణ్వాయుధాల ఫ్యాక్టరీ నిర్మాణానికి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. పర్యావరణాన్ని, ప్రజల జీవితాలను ధ్వంసం చేసే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలు, తుపాన్లు కారణంగా పంటలు నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అధిక వర్షాలు, తుపాన్లు కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని, వరి, ప్రత్తి, మొక్కజొన్న, మిర్చి, పొగాకు తదితర పంటలకు మద్దతు ధరలు కల్పించి కొనుగోలు చేయాలని, కౌలు రైతులు అందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు, అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 నుంచి 12 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది.
ఈ సమావేశంలో ఏ ఐ కె ఎం ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. దూలయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. కూర్మారావు, కోశాధికారి వి.చిట్టిబాబు రాష్ట్ర నాయకులు కె. బాలు దొర, బాల్ రెడ్డి, ఎన్. పోతురాజు, బాల సుందరం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.