అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం, ఫింగర్ ప్రింట్ సబ్‌ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.రవీంద్రారెడ్డి సీఐగా పదోన్నతి పొందిన సందర్భంగా, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛంతో కలిశారు. ఎస్పీ సీఐ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ – “పోలీసు సేవలో కృషి, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేస్తే పదోన్నతి సహజం. బాధ్యతలు పెరిగినకొద్దీ నిబద్ధత, సేవాభావం మరింత పెరగాలి. పదోన్నతి కేవలం గౌరవం కాదు, అది మరింత కర్తవ్యబాధ్యతను గుర్తు చేసే అంశం” అని తెలిపారు. ఫింగర్ ప్రింట్ విభాగంలో రవీంద్రారెడ్డి గతంలో అందించిన సేవలను కొనియాడిన ఎస్పీ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విశిష్టమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కూడా రవీంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఫింగర్ ప్రింట్ ఎస్ఐకి సీఐగా పదోన్నతి – ఎస్పీ అభినందనలు