Monday, 8 December 2025
  • Home  
  • ప్రైవేటు బస్ ల మీద కధనం.
- హైదరాబాద్

ప్రైవేటు బస్ ల మీద కధనం.

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతినిధి) స్లీపర్ బస్సుల సేఫ్టీ నిర్లక్ష్యం ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణం: కర్నూల్ దగ్గర జరిగిన బస్ ప్రమాదం నేపథ్యంలో కర్నూల్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం ద్విచక్ర వాహన దారుడు బస్ డ్రైవర్ తప్పిదం మాత్రమే కాక, బస్సు యజమాని మరియు రవాణా శాఖల నిర్లక్ష్యంతో కూడినదని నిపుణులు పేర్కొంటున్నారు. 2023లో ఓ ప్రయాణికుడు వివరించినట్లుగా, పాత స్కానియా మల్టీ ఆక్సిల్ సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చినప్పుడు సేఫ్టీ ఫీచర్లు – పెద్ద అద్దాలు, పగలకొట్టే హేమర్లు, ఫైర్ ఎక్సటింగిషర్స్, ఎమర్జెన్సీ డోర్లు – తొలగించబడ్డాయి లేదా పనిచేయట్లేదు. పైబెంచ్ ఎ.సి బస్సుల FRP ముందు భాగం వెంటనే మంటకు లోనవుతుంది, కిటికీలు లేకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. స్కానియా, వోల్వో బస్సులు ఫైర్ సేఫ్టీ ప్యాకేజీతో వస్తున్నా, వేమూరి కావేరి ట్రావెల్స్ పాత సీటర్ బస్సులను స్లీపర్‌లోకి మార్చి భద్రతను లాక్కి పెట్టారు. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా శాఖలు పర్మిట్లు ఇచ్చినప్పటికీ నిబంధనలు పట్ల నిర్లక్ష్యం చేశారు. రవాణా మంత్రి పరిపాలనా బాధ్యతను తప్పించుకుంటూ, “మనకేం సంబంధం” అని పేర్కొన్న విషయం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అనేక ట్రావెల్స్ కూడా ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ బస్సులు పరిపాలనలోనుండే బదులుగా రోడ్డుపై తిరుగుతున్నాయి. పూర్వపు ఘటనలు – జబ్బర్ ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్ – చెబుతున్నాయి రవాణా శాఖ క్రమంగా చర్యలు తీసుకుంటే ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చును. ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రవాణా శాఖల మంత్రి మరియు అధికారులు తక్షణమే ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, సీటింగ్, పర్సనల్ సేఫ్టీ ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం కొంత మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రతినిధి)

స్లీపర్ బస్సుల సేఫ్టీ నిర్లక్ష్యం ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణం:

కర్నూల్ దగ్గర జరిగిన బస్ ప్రమాదం నేపథ్యంలో

కర్నూల్ దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదం ద్విచక్ర వాహన దారుడు బస్ డ్రైవర్ తప్పిదం మాత్రమే కాక, బస్సు యజమాని మరియు రవాణా శాఖల నిర్లక్ష్యంతో కూడినదని నిపుణులు పేర్కొంటున్నారు. 2023లో ఓ ప్రయాణికుడు వివరించినట్లుగా, పాత స్కానియా మల్టీ ఆక్సిల్ సీటర్ బస్సును స్లీపర్ బస్సుగా మార్చినప్పుడు సేఫ్టీ ఫీచర్లు – పెద్ద అద్దాలు, పగలకొట్టే హేమర్లు, ఫైర్ ఎక్సటింగిషర్స్, ఎమర్జెన్సీ డోర్లు – తొలగించబడ్డాయి లేదా పనిచేయట్లేదు. పైబెంచ్ ఎ.సి బస్సుల FRP ముందు భాగం వెంటనే మంటకు లోనవుతుంది, కిటికీలు లేకపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.

స్కానియా, వోల్వో బస్సులు ఫైర్ సేఫ్టీ ప్యాకేజీతో వస్తున్నా, వేమూరి కావేరి ట్రావెల్స్ పాత సీటర్ బస్సులను స్లీపర్‌లోకి మార్చి భద్రతను లాక్కి పెట్టారు. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రవాణా శాఖలు పర్మిట్లు ఇచ్చినప్పటికీ నిబంధనలు పట్ల నిర్లక్ష్యం చేశారు. రవాణా మంత్రి పరిపాలనా బాధ్యతను తప్పించుకుంటూ, “మనకేం సంబంధం” అని పేర్కొన్న విషయం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

అనేక ట్రావెల్స్ కూడా ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ బస్సులు పరిపాలనలోనుండే బదులుగా రోడ్డుపై తిరుగుతున్నాయి. పూర్వపు ఘటనలు – జబ్బర్ ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్ – చెబుతున్నాయి రవాణా శాఖ క్రమంగా చర్యలు తీసుకుంటే ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చును.

ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రవాణా శాఖల మంత్రి మరియు అధికారులు తక్షణమే ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, సీటింగ్, పర్సనల్ సేఫ్టీ ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం కొంత మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించగలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.