ప్రజల ప్రాణాలే ప్రథమమని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. రైల్వే కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, గత పాలనలో నిర్వీర్యమైన అంబులెన్స్ వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం పునఃపటిష్టం చేస్తోందన్నారు. 108, 104 అంబులెన్స్‌లను వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, జీపీఎస్ పర్యవేక్షణ, అత్యవసర పరికరాల సమకూర్పు చేపట్టామన్నారు. డ్రైవర్లు, సిబ్బందికి క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. మంగంపేట ప్రమాదంలో అంబులెన్స్ సకాలంలో చేరిన ఘటన ప్రస్తుత వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రాణాలకు ప్రథమ ప్రాధాన్యం – అంబులెన్స్ సేవల పటిష్టతపై అరవ శ్రీధర్