Thursday, 5 February 2026
  • Home  
  • ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం లో వి ఆర్ రాసాని రచనలు ఆవిష్కరణ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం లో వి ఆర్ రాసాని రచనలు ఆవిష్కరణ

———————————————— వెంకటాచలం సరస్వతి నగర్లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లో తిరుపతికి చెందిన తెలుగు విశ్రాంత ఆచార్యులు డా వి ఆర్ రాసాని మూడు రచనలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభా అధ్యక్షులుగా ప్రాచీన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించి రచయిత పరిచయం చేసి పుస్తక ఆవిష్కరణలు చేయించారు. తాజా కథాసంపుటి ప్రసిద్ధ కథా రచయిత్రి వి ప్రతిమ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. తనంత తానుగా రూపాన్ని సంతరించుకున్న సహజ కథల సంపుటి మా ఊరికథలు అన్నారు. ఈ కథలు ఆట ప్రధానంగా రాసినవి అంటూ పలు కథలు పరిచయం చేశారు. డా రాసాని భాష ప్రతిభ అసామాన్యమైనదని అన్నారు. సీమకథలు పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. సీమకథలు పరిచయం చేస్తూ రాసాని చిరకాల మిత్రుడు అంటూ ఆయన ముఖ్యంగా జానపద రచనల్లో పట్టు సాధించారు అన్నారు..రాసాని కథలలో చింతచెట్టు కథతో తాను మమేక మయ్యానన్నారు .. స్థానికత ఈ కథల్లో పదునుగా నమోదు చేసారన్నారు. మతసామరస్యం ఒక కథలో ఏ మతమైతే ఏమున్నదీ మంచి చేయడానికి అని చెప్పడం బాగా విశ్లేషించారు. శ్రవ్య,దృశ్య నాటక రచన గ్రంథం సీమ యవనిక విశ్రాంత ఆచార్య నాగోలు కృష్ణా రెడ్డి అంతర్జాతీయకవి సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరణ చేసి విశ్లేషణ చేశారు. శ్రవ్య నాటక పరిచయం చేస్తూ నాగోలు కృష్ణారెడ్డి రాసాని తరిగొండ వెంగమాంబ నాటకం 100 ప్రదర్శనలు పూర్తి చేసుకుందని, దీనివల్ల వెంగమాంబ అందరికీ పరిచయం అయిందని అన్నారు. విలక్షణ వస్తువులపై రాసాని రచనలు చేయడం లో దిట్ట అన్నారు. దృశ్య రూపకాలు విశ్లేషణ చేస్తూ డా పెరుగు రామకృష్ణ రాసాని నాటకాలు చదివినప్పుడు కర్ణాటక నుండి నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తో సారూప్యత గురించి తులనాత్మక అధ్యయనం చేశారు. వీరిద్దరూ సామాజిక బాధ్యత తో దృశ్య రచన చేశారు అన్నారు..నేలతీపి, దేవర మాన్యం లాంటి గొప్ప నాటకాలు అన్నారు. చివరగా రచయిత స్పందన వినిపిస్తూ రాసాని తన శ్రీమతి కూడా వైద్యురాలు, రచయిత్రి కనుక ఆమె సహకారం వల్లే ఇంత సాహితీ జైత్ర యాత్ర చేయగలిగాను అన్నారు..పరిశోధనే నా రచనల ప్రాణం అన్నారు..ప్రాచీన కేంద్రం పరిశోధక బృందం ప్రార్థన-వందనసమర్పణ చేశారు..!

————————————————
వెంకటాచలం సరస్వతి నగర్లో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం లో తిరుపతికి చెందిన తెలుగు విశ్రాంత ఆచార్యులు డా వి ఆర్ రాసాని మూడు రచనలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సభా అధ్యక్షులుగా ప్రాచీన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించి రచయిత పరిచయం చేసి పుస్తక ఆవిష్కరణలు చేయించారు.
తాజా కథాసంపుటి ప్రసిద్ధ కథా రచయిత్రి వి ప్రతిమ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు.
తనంత తానుగా రూపాన్ని సంతరించుకున్న సహజ కథల
సంపుటి మా ఊరికథలు అన్నారు.
ఈ కథలు ఆట ప్రధానంగా రాసినవి అంటూ పలు కథలు పరిచయం చేశారు. డా రాసాని భాష ప్రతిభ అసామాన్యమైనదని అన్నారు.
సీమకథలు పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ ఆవిష్కరించి విశ్లేషణ చేశారు. సీమకథలు పరిచయం చేస్తూ రాసాని చిరకాల మిత్రుడు అంటూ ఆయన ముఖ్యంగా జానపద రచనల్లో పట్టు సాధించారు అన్నారు..రాసాని
కథలలో చింతచెట్టు కథతో తాను మమేక మయ్యానన్నారు .. స్థానికత ఈ కథల్లో పదునుగా నమోదు చేసారన్నారు. మతసామరస్యం ఒక కథలో ఏ మతమైతే ఏమున్నదీ మంచి చేయడానికి అని చెప్పడం బాగా విశ్లేషించారు. శ్రవ్య,దృశ్య నాటక రచన గ్రంథం సీమ యవనిక విశ్రాంత ఆచార్య నాగోలు కృష్ణా రెడ్డి
అంతర్జాతీయకవి సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ ఆవిష్కరణ చేసి విశ్లేషణ చేశారు. శ్రవ్య నాటక పరిచయం చేస్తూ నాగోలు కృష్ణారెడ్డి రాసాని తరిగొండ వెంగమాంబ నాటకం 100 ప్రదర్శనలు పూర్తి చేసుకుందని, దీనివల్ల వెంగమాంబ అందరికీ పరిచయం అయిందని అన్నారు. విలక్షణ వస్తువులపై రాసాని రచనలు చేయడం లో దిట్ట అన్నారు. దృశ్య రూపకాలు విశ్లేషణ చేస్తూ డా పెరుగు రామకృష్ణ రాసాని
నాటకాలు చదివినప్పుడు కర్ణాటక నుండి నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తో సారూప్యత గురించి తులనాత్మక అధ్యయనం చేశారు.
వీరిద్దరూ సామాజిక బాధ్యత తో దృశ్య రచన చేశారు అన్నారు..నేలతీపి, దేవర మాన్యం లాంటి గొప్ప నాటకాలు అన్నారు.
చివరగా రచయిత స్పందన వినిపిస్తూ రాసాని తన శ్రీమతి కూడా వైద్యురాలు, రచయిత్రి కనుక
ఆమె సహకారం వల్లే ఇంత సాహితీ జైత్ర యాత్ర చేయగలిగాను అన్నారు..పరిశోధనే నా రచనల ప్రాణం అన్నారు..ప్రాచీన కేంద్రం పరిశోధక బృందం ప్రార్థన-వందనసమర్పణ చేశారు..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.