శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు గిరిజన బాలబాలికలకు శనివారం నాడు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వారి సౌజన్యంతో ఇచ్చిన సైకిళ్లను ప్రధానోపాధ్యాయురాలు జయకుమారి చేతుల మీదుగా తిరుపతి జిల్లా విద్యాశాఖ, పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ…సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు నడిచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు గొప్ప సహాయంగా నిలుస్తాయని విద్య అందరికీ చేరేలా దాతలు చేస్తున్న సహకారం అభినందనీయమని, ఇలాంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ప్రతిరోజూ బడికి హాజరై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణం కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశం రాజు, చెంగళ్రాయులు, చంద్రయ్య, గోపి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల వితరణ