మోసానికి చిరునామాగా ఆంగ్ల బాష కీర్తి గడించింది
ప్రభుత్వ కార్యాలయంల్లో ఆంగ్ల బాషను రద్దు చేయాలి .
ఎక్కువగా మోసాలు – కుంభ కోణాలు ఆంగ్ల బాష తోనే జరుగుతున్నాయి .
ప్రభుత్వ కార్యాలయాలన్ని బోర్డులు , ఇతర కార్యకలాపాలన్ని మాతృ బాష లోనే జరగాలి .
మేడా శ్రీనివాస్ , డిమాండ్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
న్యాయస్థానాల్లో సైతం మాతృ బాష లోనే తీర్పులు అమలు చేస్తేనే ఆంగ్ల నేరాలు తగ్గుముఖం పడతాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు ..
మోసాలకు , అక్రమాకలకు, అధికార దుర్వినియోగ చర్యలకు ఆంగ్ల బాష ప్రసిద్ధి చెందింది . అత్యధిక మోసాలు అన్ని ఆంగ్ల బాష లోనే జరుగుతుండటం విశేషం . ఆంగ్ల దేశాల వలే ఆంగ్ల బాషకు కూడా ఒక రకమైన ఆధిపత్య ధోరణికి మార్గం ఉంటుంది . ఆంగ్ల బాష పుట్టుకలోనే మోసం, దగా, ఆధిపత్యంతో కూడిన మూలాలు బలంగా ఉంటాయి . బలవంతంగా ఆంగ్ల బాషను యావత్ భారతీయులపై రుద్దుతున్నారు . ఆంగ్ల బాష భారతీయులకు శత్రు బాష అని ప్రతి భారతీయుడు విశ్వసిస్తాడు. ఆంగ్ల బాష , ఆంగ్ల దేశాలు భారతీయుల చెడు కోరేవి , ఆ బాష , ఆ దేశాల స్వభావం విష పాములను పెంచి పోషిస్తున్నట్టే నని భారతీయులు భావిస్తారు . ఆంగ్ల బాష , ఆంగ్ల దేశ సంప్రదాయాలకు బానిసలుగా మారుతున్న మన కార్పొరేట్ పాలకులు ఆ భాషతో అనేక కుంబకోణాలు , అనేక నేరాలకు కేంద్ర బిందువుగా చారిత్రిక స్థానం కైవసం చేసుకుంటుంన్నారు . ప్రపంచం మొత్తంగా జరిగే ప్రతి మోసం కు ప్రధాన చిరునామాగా ఆంగ్ల బాష కీర్తింప బడుతుందని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు ..
అనేక కార్పొరేట్ నేరగాళ్లు ఆంగ్ల బాషను అస్త్రంగా మార్చుకుని లక్షల కోట్లు ఆర్ధిక నేరాలకు మార్గం చేసుకుంటున్నారు . ప్రతి అధికారిక మోసం , కుట్ర, దగా లకు ఆంగ్ల భాష వెన్నంటే ఉంటుంది . ప్రతి మోసానికి ఆంగ్ల బాష ఒక ఆయుధం వలే ఉంటుంది . ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార దుర్వినియోగ కార్యకలాపాలాన్ని ఆంగ్ల బాషను ప్రోత్సహించేదిగానే ఉంటుందని ఇందుకు అనేక బలమైన కారణంగా సైతం ఉంటాయి . మాతృ బాషలో పాలనా సంస్కారణలను అమలు చేస్తే మోసం చేయటం, మోసపోవటం అంత సులువైనది కాదు అని గుర్తించాలి . ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంగ్ల బాషను రద్దు చేసి మాతృ బాషలను ప్రోత్సహించే విధంగా చట్టాలను సవరించాలని ఆయన కోరారు .
ఆంగ్ల బాష మోసాలకు, కుంభకోణాలకు కేంద్ర బిందువుగా మారింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు . ఆంగ్ల బాష కు ఒక శాప్రదాయం , సంస్కృతి , ఒక గౌరవ ప్రతిష్ట ఆ బాషకు గల పుట్టుక లోనే లేదని , ఆంగ్ల బాష ఎందుకో నేడు మోసాలను శాసించే స్థాయిలో కూర్చుంది . ప్రతి నేరం వెనుక ఆంగ్ల బాష ప్రమేయం , తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. నేరస్తుడుకి ఒక ముడి సరుకు వలే ఆంగ్ల బాష అండగా నిలుస్తుంది . సామాన్యులకు , నిజాయితీగా బ్రతకటానికి ఏ మాత్రం పనికిరాని బాష ఆంగ్లం అని తెలిసి కూడా పాలకులు ఆంగ్ల బాష ను నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు . అన్ని రకాల నేరాలకు ఒక భూతం వలే ఆంగ్ల బాష నడుస్తుంది .మాతృ బాషలో నిజాయితీ, గౌరవం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్వచ్ఛత, మమతానురాగాలు నిలువెత్తున కనపడుతుంటాయి . కసాయి తనంకు , ఆధిపత్యాల తోను ప్రపంచ వినాశనాన్ని కోరుకునే ఆంగ్ల బాషకు భారతీయులు పాతరేయాలని ఆయన తెలిపారు ..
ప్రభుత్వ కార్యాలయాల బోర్థులు అన్ని మాతృ బాష లోనే వుండే విధంగా ప్రభుత్వాలు చర్యలకు ఆదేశించాలి . ప్రభుత్వ కార్యకలాపాల అన్నింట ప్రతి చర్య కూడా మాతృ బాషను ప్రేమించే విధంగా ఉండాలి . ఆంగ్ల బాషను ఒక టీష్యు పేపర్ వలే వినియోగించుకోవాలి తప్ప నెత్తిన పెట్టుకుని పూజించరాదు . న్యాయస్థానాల్లో సైతం మాతృ భాషల్లోనే మొత్తం పూర్తి ప్రక్రియ జరిగే విధంగా సంస్కరణలు అమలు జరగాలి . అత్యున్నత భారతదేశ ప్రధాన న్యాయమూర్తులు సైతం అనేక సందర్భాల్లో మాతృ భాష ల్లోనే తీర్పులు వెలువడే విధంగా ప్రణాళికలు అమలు చేయటంపై ఉన్నత న్యాయస్థానం దృష్టి సారిస్తుందని చెప్పిన ఘటనలు వున్నాయి . భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లోను, న్యాయస్థానాల్లోను ఆంగ్ల బాష ను పూర్తిగా రద్దు చేసి మాతృ బాషలను అమలు చేసే విధంగా విప్లవాత్మాక తిరుగుబాటు వస్తుందని , ఆంగ్లం వద్దు , మాతృ బాష ముద్దు అనే నినాదాన్ని దేశ వ్యాప్తంగా రగిలించాలి . ఆంగ్లం మాట్లాడటం అవమానం అనే రోజులు భారత్ లో మొదలవుతాయి. ముందు ముందు రోజులు ఆంగ్లం మాట్లాడటం అవమాన కరం అనే పరిస్థితులు భవిష్యత్ సమాజం నిర్దేశిస్తుంది . ముందు ముందు అఖండ భారత్ లో యావత్ ప్రజలు ఆలోచన చేస్తారు . యావత్ అఖండ భారతీయులు అందరు స్వదేశీ మాతృ బాష ఉద్యమాల్లో పాల్గొనాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు
సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు .
ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాద్ , వర్ధనపు శరత్ కుమార్ , వల్లి శ్రీనివాసరావు , గుడ్ల దుర్గా ప్రసాద్ , చల్లా సాంబశివరావు , బసా సోనియా , కాకర ప్రసాద్ , రెడ్డి స్వర్ణలత , కోట సుశీల , చల్లా దుర్గారావు , కందివలస రమణ , కందివలస హైమావతి , యర్రా బాల మురళి కృష్ణ , ముగ్గుల రాజేష్ , అల్లాడ రమేష్, సుంకర వెంకట భాస్కర రంగారావు తదితరులు పాల్గొన్నారు.


