Wednesday, 25 March 2026
  • Home  
  • ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- యాదాద్రి భువనగిరి

ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి భూషి మహేష్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా దళితులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని గౌరవనీయులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ గారి ఆదేశానుసారం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విషయం ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరడం జరిగింది. కబ్రిస్తాన్ వైకుంఠధామాల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూముల కు హక్కును కల్పించి పట్టాలను ఇవ్వాలని, డప్పు చెప్పు వృత్తిదారులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు వరకు పెంచాలని, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ లోన్లు తీసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఉపయోగించి ప్రతి దళిత వాడను అభివృద్ధి చేయాలని కోరనైనది. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లను విద్య హక్కు చట్టం ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగ, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగళ్ల రమేష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘీ స్వామి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం మహేందర్, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బొట్ల అనిల్, కలకుంట్ల రమేష్, బైరపాక సురేష్, మోత్కుపల్లి రవి, ముడుగుల రాములు, బోగారం మురళి, పెరుమళ్ళ కిషన్, బొట్ల మహేష్, బొట్ల పరశురాం, తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి
ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

భూషి మహేష్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా దళితులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని గౌరవనీయులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ గారి ఆదేశానుసారం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విషయం ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ అభయ హస్తం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరడం జరిగింది. కబ్రిస్తాన్ వైకుంఠధామాల పేరుతో దళితుల వద్ద నుండి లాక్కున్న అసైన్డ్ భూముల కు హక్కును కల్పించి పట్టాలను ఇవ్వాలని, డప్పు చెప్పు వృత్తిదారులకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలియజేయడం జరిగింది, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలు వరకు పెంచాలని, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ లోన్లు తీసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఉపయోగించి ప్రతి దళిత వాడను అభివృద్ధి చేయాలని కోరనైనది. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లను విద్య హక్కు చట్టం ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు మాదిగ, యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసగళ్ల రమేష్ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంఘీ స్వామి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం మహేందర్, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బొట్ల అనిల్, కలకుంట్ల రమేష్, బైరపాక సురేష్, మోత్కుపల్లి రవి, ముడుగుల రాములు, బోగారం మురళి, పెరుమళ్ళ కిషన్, బొట్ల మహేష్, బొట్ల పరశురాం, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.