Thursday, 5 February 2026
  • Home  
  • ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్*
- విశాఖపట్నం

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్*

*ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్* *విశాఖపట్నం,దివ్యదర్శిని న్యూస్*: ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్రం వైబ్రంట్ స్టేట్ గా విరాజిల్లుతోందని చెప్పారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్ధ సారధి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ సదస్సును విజయవంతంగా నిర్వహించుటకు మంచి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్రానికి సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు కి ముందు తరవాత అనే రీతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. సమర్ధ వంతమైన నాయకుడు చంద్రబాబు పై నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. వెళ్లి పోయిన పరిశ్రమలు సైతం వెనక్కి వస్తున్నాయని, నారా లోకేశ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో తో రాష్ట్రం అభివృద్ది చెందుతోందని చెప్పారు. సుమారు పది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వివరించారు. సమావేశానికి ముందే ..కంపెనీల భూమి పూజలు అవుతున్నాయని, గూగుల్, టిసిఎస్ ,లాంటి పెద్ద సంస్థలు విశాఖ లో సంస్థ నెలకొల్పుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ సదస్సులో కనీసం 450 నుండి ఐదు వందల పెట్టుబడి ఒడంబికలు జరగనున్నాయని చెప్పారు. ఈ ఒడంబికలు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని, పెట్టుబడులు లక్షల కోట్లలో రానున్నాయని చెప్పారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సుకు జాతీయ అంతర్జాతీయ స్థాయి నుండి డెలిగేట్ లు పాల్గొంటున్నారని తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ , రాష్ట్ర స్థాయిలో 40 వరకు సెషన్స్ జరగనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రారంభించిన ఇల్లకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం మధ్య లో వదిలేసిన ఇళ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. మరి కొద్ది నెలల్లో రెండో విడత మరిన్ని ఇళ్లకు గృహప్రవేశం చేస్తామని అన్నారు.

*ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్రప్రదేశ్*

*విశాఖపట్నం,దివ్యదర్శిని న్యూస్*: ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్రం వైబ్రంట్ స్టేట్ గా విరాజిల్లుతోందని చెప్పారు.
సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి కొలుసు పార్ధ సారధి గురువారం పరిశీలించారు. ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ సదస్సును విజయవంతంగా నిర్వహించుటకు మంచి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. రాష్ట్రానికి సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు కి ముందు తరవాత అనే రీతిలో అభివృద్ధి జరుగుతోందన్నారు. సమర్ధ వంతమైన నాయకుడు చంద్రబాబు పై నమ్మకంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. వెళ్లి పోయిన పరిశ్రమలు సైతం వెనక్కి వస్తున్నాయని, నారా లోకేశ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో తో రాష్ట్రం అభివృద్ది చెందుతోందని చెప్పారు.
సుమారు పది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వివరించారు.
సమావేశానికి ముందే ..కంపెనీల భూమి పూజలు అవుతున్నాయని, గూగుల్, టిసిఎస్ ,లాంటి పెద్ద సంస్థలు విశాఖ లో సంస్థ నెలకొల్పుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ సదస్సులో కనీసం 450 నుండి ఐదు వందల పెట్టుబడి ఒడంబికలు జరగనున్నాయని చెప్పారు. ఈ ఒడంబికలు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని, పెట్టుబడులు లక్షల కోట్లలో రానున్నాయని చెప్పారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సుకు జాతీయ అంతర్జాతీయ స్థాయి నుండి డెలిగేట్ లు పాల్గొంటున్నారని తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ , రాష్ట్ర స్థాయిలో 40 వరకు సెషన్స్ జరగనున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పుడు ప్రారంభించిన ఇల్లకు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం మధ్య లో వదిలేసిన ఇళ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. మరి కొద్ది నెలల్లో రెండో విడత మరిన్ని ఇళ్లకు గృహప్రవేశం చేస్తామని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.