

ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆముదాలవలస అధ్యక్షులు జలుమూరు.వెంకటేశ్వరులు (వెంకుబాబు) అన్నారు. స్థానిక అశోక పబ్లిక్ పాఠశాలలో, వివిధ పాఠశాలలకు చెందిన ఎనభై మంది విద్యార్థులకు పీస్ పోస్టర్ పోటీలను నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
అనంతరం అధ్యక్షులు లయన్ జె. వెంకుబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, అందులో భాగముగానే ఈ రోజు విద్యార్థులకు ప్రపంచ శాంతిపై అవగాహన కల్పించామన్నారు. ప్రతీ ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని, అప్పుడే నిర్ధేశించుకున్న స్థానానికి చేరుకుంటామని, ప్రపంచం శాంతిగా ఉంటె, ఎటువంటి అనైతిక ఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ముందుగా శాంతి ప్రతిజ్ఞ చేస్తారని గుర్తుచేశారు.
అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ సహకారంతో మొక్కలను నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చెప్పి, మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమానికి సహకరించిన పాఠశాల అధినేత విటి.చౌదరికు ధన్యవాదాలని, ప్రతీ విద్యార్థి ఒక మొక్కను నాటి, భావితరానికి మార్గదర్శిగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆముదాలవలస కార్యదర్శి బి.సునీత, కోశాధికారి పొన్నాడ రోషిణి, సభ్యులు కుప్పిలి.సత్యన్నారాయణ, తమ్మన సంతోష్, తమ్మన కీర్తి, పొట్నూరు సురేష్, రత్నాకర్, అశోక పబ్లిక్ స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

