ప్రధాన మంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా స్వస్థ నారీ ససక్త పరివార్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతోంది. ఈ క్రమంలో చిట్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి మరియు కె.కె. వడ్డిపల్లి కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. చిట్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అన్సారీ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బిడ్డ తల్లులకు ఎన్‌సీడీ స్క్రీనింగ్, టిబి అవగాహన, రక్తపరీక్షలు, ఇమ్మ్యూనైజేషన్, స్కాన్ పరీక్షలు చేశారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సల్మా, పీహెచ్‌ఈఓ విజయ్‌కుమార్, పీహెచ్‌ఎన్ ధనలక్ష్మి, విజయకుమారి, సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా, ఎంఎల్హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చురుకుగా పాల్గొన్నారు. అదేవిధంగా కె.కె. వడ్డిపల్లి కాలనీలో కూడా ఎంఓ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో, సూపర్వైజర్ ఇస్మాయిల్ బాషా పర్యవేక్షణలో శిబిరం నిర్వహించారు. మహిళలు, పిల్లలు, గర్భిణీలకు బీపీ, షుగర్, రక్తపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎమ్ పరిదా, ఎంఎల్హెచ్‌పీ రుఖియా భాను, కృష్ణవేణి, శాంతికుమారి, ఆశావర్కర్లు సేవలందించారు. ఈ శిబిరాల ద్వారా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో లబ్ధి పొందగా, వైద్యులు మహిళల ఆరోగ్యం, పిల్లల శ్రేయస్సు కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇంటింటికి చేరుస్తామని తెలిపారు.

ప్రధాని జన్మదినోత్సవానికి నూతన అర్థం: గ్రామీణులకు వైద్య శిబిరాల వరం మహిళా ఆరోగ్యం – కుటుంబ శక్తి: చిట్వేల్, వడ్డిపల్లిలో స్వస్థ నారీ ససక్త పరివార్ వైద్య శిబిరాలు