ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం.
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులు ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేస్తున్నట్టు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సీతంపేట లోని పార్టీ కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
లబ్ధిదారులందరికీ ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ హోసింగ్ AE
M. M. నాయుడు,
ఇంజనీరింగ్ అసిస్టెంట్ T. రాజశేఖర్,
జనసేన సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, 33 వార్డ్ కార్పొరేటర్ GK, కనీస వేతనాలు సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగు లక్ష్మి, 32 వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు 34 వ వార్డ్ అధ్యక్షులు నీలం రాజు, 32వ వార్డ్ అధ్యక్షులు తెలుగు అర్జున్, 29 వ వార్డ్ అధ్యక్షులు శ్రవణ్, 37 వార్డ్ అధ్యక్షులు గరికిన రవి, జనసేన వార్డ్ ఇంచార్జిలు డా, మర్రివేముల శ్రీనివాస్, నారా నాగేశ్వరావు, జనసేన నాయకులు మాన్యల శ్రీనివాస్, ప్రణీత్ మరియు జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.


