Tuesday, 24 March 2026
  • Home  
  • ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు – బీజేపీ పిలుపు
- అన్నమయ్య

ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు – బీజేపీ పిలుపు

దేశంలో స్వావలంబనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్ స్వగృహం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు “ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు” ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – విదేశీ వస్తువుల బదులు భారతీయంగా తయారైన ఉత్పత్తులను వినియోగించాలని, దీని ద్వారా దేశీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, కూలీలు బలోపేతం అవుతారని తెలిపారు.మన దేశంలో తయారైన వస్తువులు ఉపయోగించడం అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబనకు దారి తీసే మార్గం కూడా” అని బీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.స్వదేశీని వాడండి దేశాన్ని బలపరచండి అనే నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది అని తెలిపారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు నందలూరు మండలంలో పలు పంచాయతీల్లో స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి,ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, రాష్ట్ర దళిత మోర్చ్ రమణయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ విఠలాచార్య స్వామి,మాజీ మండల అధ్యక్షుడు ఆండ్ర శివారెడ్డి,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు సివి,సుబ్బయ్య, మండెం నాగేంద్ర,ప్రధాన కార్యదర్శులు రాజబోయిన మహేష్, కొండపల్లి గంగయ్య,బీజేపీ పార్టీ యువనాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి,రాచూరి మురళి,తదితరులు పాల్గొనడం జరిగినది.

దేశంలో స్వావలంబనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రాంప్రసాద్ స్వగృహం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు “ప్రతి ఇంట స్వదేశీ వస్తువులు” ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ – విదేశీ వస్తువుల బదులు భారతీయంగా తయారైన ఉత్పత్తులను వినియోగించాలని, దీని ద్వారా దేశీయ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు, కూలీలు బలోపేతం అవుతారని తెలిపారు.మన దేశంలో తయారైన వస్తువులు ఉపయోగించడం అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబనకు దారి తీసే మార్గం కూడా” అని బీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు.స్వదేశీని వాడండి దేశాన్ని బలపరచండి అనే నినాదంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది అని తెలిపారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు నందలూరు మండలంలో పలు పంచాయతీల్లో స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి,ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ, రాష్ట్ర దళిత మోర్చ్ రమణయ్య ,జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ విఠలాచార్య స్వామి,మాజీ మండల అధ్యక్షుడు ఆండ్ర శివారెడ్డి,తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు సివి,సుబ్బయ్య, మండెం నాగేంద్ర,ప్రధాన కార్యదర్శులు రాజబోయిన మహేష్, కొండపల్లి గంగయ్య,బీజేపీ పార్టీ యువనాయకులు వీరబల్లి జయకుమార్ రెడ్డి,రాచూరి మురళి,తదితరులు పాల్గొనడం జరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.