ప్రతిభకు పట్టం….
వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా…
రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ
అధిష్టానం ఓబులవారిపల్లి మండల వాసి కి అగ్ర తాంబూలం…
హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు…
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 ( పున్నమి న్యూస్ ప్రతినిధి-సింగమాల వెంకటేష్ సింగమాల వెంకటేష్):
రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసిపి పార్టీలో వీర విధేయుడిగా పార్టీ అధిష్టానం ప్రకారం వైసీపీ పార్టీకి ఒక దశాబ్దం విధేయతను ప్రదర్శిస్తుంది అటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీకి బలోపేతానికి మైనార్టీ పార్టీల తరఫున పార్టీ అభివృద్ధి కష్టపడి పని చేయడంతో ప్రతిభకు అధిష్టానం పట్టం కట్టింది రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపూడి గ్రామానికి చెందిన సుకేసుల రఫీ విధేయతను మెచ్చి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసిపి పార్టీ మైనార్టీ కార్యదర్శిగా సీనియర్ నాయకులు సుంకేసుల రఫీని నియమించడం మైనార్టీ నాయకులలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అంతేకాకుండా పార్టీలో మైనార్టీ తరఫున విశేష కృషి చేసి వైసిపి పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకోవడంతోపాటు మైనార్టీలను ఒక తాటిపై నడిపించే ఘనత ఆయనకు దక్కిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మైనార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వైసీపీ పార్టీకి ఎప్పటికీ ఉంటానని సుంకేసుల రఫీ అభిప్రాయం వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పదవి నాకు అప్పగించిన మాజీ మంత్రి వైసిపి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అలాగే ఎంపీ మిధున్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి అధికార ప్రతినిధి కొరముట్లశ్రీనివాసులకు రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ పార్టీ మైనార్టీసీల అధ్యక్షులు ఖాదర్ బాషా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారికి ఎల్లవేళలా విధేయతను ప్రదర్శిస్తూ నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు నా మన్నారు


