Thursday, 5 February 2026
  • Home  
  • ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాంతాలను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్
- విశాఖపట్నం

ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాంతాలను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాంతాలను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ *విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ, జోన్-8 పరిధిలోగల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలలో భాగంగా వేపగుంట నుండి పినగాడి రోడ్డు తో పాటు జుత్తాడ రోడ్డు లను విస్తరించేందుకు ప్రతిపాదించిన రోడ్ల విస్తరణ వివరాలను త్వరితగతిన ప్రణాళికాయుతంగా సిద్ధం చేసి నివేదించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు, చీఫ్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. గురువారం ఆయన 8వ జోన్ లోని వేపగుంట నుండి పినగాడి, వేపగుంట నుండి జుత్తాడ వెళ్లే మార్గాలను జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ వేపగుంట నుండి జుత్తాడ వెళ్లే ప్రతిపాదిత రోడ్డు సుమారు 6.15 కిలోమీటర్లు 80 అడుగుల రోడ్డు విస్తరణకు, వేపగుంట నుండి పినగాడి రోడ్డులో ప్రతిపాదిత రోడ్డు వేపగుంట నుండి 3.9 కిలోమీటర్లు మేర 20 అడుగుల రోడ్డు నుండి 60 అడుగుల రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అవసరమయ్యే చర్యలు, ప్రణాళికలతో కార్యాచరణకు సిద్ధం చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన ఆయా మార్గాల విస్తరణలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ లను పరిశీలించి, వేపగుంట నుండి జుత్తాడ రోడ్డుకు సంబంధించి వి ఎం ఆర్ డి ఏ, దేవస్థానం, ఫారెస్ట్, వారికి సంబంధించిన భూములు ఉన్నాయని వారందరికీ రోడ్డు విస్తరణకు సంబంధించిన కార్యచరణ చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదిత లేఖలను పంపించడం జరిగిందని, మిగిలిన మార్గంలో జిరాయితీ భూమి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో సర్వే చేసి నివేదిక త్వరితగతిన సమర్పించాలని, అలాగే వేపగుంట నుండి పినగాడి వెళ్లే మార్గంలో సుమారు 3.9 కిలోమీటర్లు 60 అడుగులు రోడ్డు విస్తరణకు గాను 2.5 కిలోమీటర్లు ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని, మిగిలిన 1.4 కిలోమీటర్లు ఆర్డిఓ వారికి నివేదిక పంపించడం జరిగిందని, ఆ నివేదిక వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాసరావు, డిసిపి రామ్మోహన్, ఏసిపి రామలింగేశ్వర రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ దిలీప్, టౌన్ సర్వేయర్లులు, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిపాదిత రోడ్డు విస్తరణ ప్రాంతాలను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

*విశాఖపట్నం డిసెంబర్ 11 పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ, జోన్-8 పరిధిలోగల మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలలో భాగంగా వేపగుంట నుండి పినగాడి రోడ్డు తో పాటు జుత్తాడ రోడ్డు లను విస్తరించేందుకు ప్రతిపాదించిన రోడ్ల విస్తరణ వివరాలను త్వరితగతిన ప్రణాళికాయుతంగా సిద్ధం చేసి నివేదించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు, చీఫ్ సిటీ ప్లానర్ ను ఆదేశించారు. గురువారం ఆయన 8వ జోన్ లోని వేపగుంట నుండి పినగాడి, వేపగుంట నుండి జుత్తాడ వెళ్లే మార్గాలను జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు సత్యనారాయణ రాజు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ వేపగుంట నుండి జుత్తాడ వెళ్లే ప్రతిపాదిత రోడ్డు సుమారు 6.15 కిలోమీటర్లు 80 అడుగుల రోడ్డు విస్తరణకు, వేపగుంట నుండి పినగాడి రోడ్డులో ప్రతిపాదిత రోడ్డు వేపగుంట నుండి 3.9 కిలోమీటర్లు మేర 20 అడుగుల రోడ్డు నుండి 60 అడుగుల రోడ్డు విస్తరణ చేపట్టేందుకు అవసరమయ్యే చర్యలు, ప్రణాళికలతో కార్యాచరణకు సిద్ధం చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన ఆయా మార్గాల విస్తరణలకు సంబంధించిన రోడ్డు మ్యాప్ లను పరిశీలించి, వేపగుంట నుండి జుత్తాడ రోడ్డుకు సంబంధించి వి ఎం ఆర్ డి ఏ, దేవస్థానం, ఫారెస్ట్, వారికి సంబంధించిన భూములు ఉన్నాయని వారందరికీ రోడ్డు విస్తరణకు సంబంధించిన కార్యచరణ చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదిత లేఖలను పంపించడం జరిగిందని, మిగిలిన మార్గంలో జిరాయితీ భూమి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో సర్వే చేసి నివేదిక త్వరితగతిన సమర్పించాలని, అలాగే వేపగుంట నుండి పినగాడి వెళ్లే మార్గంలో సుమారు 3.9 కిలోమీటర్లు 60 అడుగులు రోడ్డు విస్తరణకు గాను 2.5 కిలోమీటర్లు ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని, మిగిలిన 1.4 కిలోమీటర్లు ఆర్డిఓ వారికి నివేదిక పంపించడం జరిగిందని, ఆ నివేదిక వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని జీవీఎంసీ ప్రధాన ఇంజనీరు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ పరిశీలనలో జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాసరావు, డిసిపి రామ్మోహన్, ఏసిపి రామలింగేశ్వర రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ దిలీప్, టౌన్ సర్వేయర్లులు, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.