Monday, 23 March 2026
  • Home  
  • ప్రణాళిక తొ నాయకత్వ వికాసం
- విశాఖపట్నం

ప్రణాళిక తొ నాయకత్వ వికాసం

*సృజనాత్మకత, ప్రణాళికతో నాయకత్వ వికాసం* విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: *సృజనాత్మకత, పటిష్ట ప్రణాళికతతో నాయకత్వ వికాసం సాద్యపడుతుందని ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులు, ఐఐటీ భువనేశ్వర్ పూర్వ డైరెక్టర్, ఆర్ జియుకటి (ఐఐఐటి) వ్యవస్థాపక ఉపకులపతి ఆచార్య ఆర్.వి రాజ కుమార్ అన్నారు.* ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్ప వాలలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో “ఒక ఆదర్శ విశ్వవిద్యాలయాన్ని సృష్టించడంలో నాయకత్వ సవాళ్లు మరియు సంతృప్తికరమైన అనుభవాలు అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత, దూరదృష్టితో పనిచేసే తత్వం కలిగి ఉండాల ని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య ను అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్. జి.యు.కె.టి ల స్థాపన, అభివృద్ధి చేసిన విధానం, తొలి నాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. ఈ ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లు. ప రిమిత వనరులతో పనిచేస్తూ పనిచేసిన విధానం వివరించారు. సాధారణ బోధనకు భిన్నంగా వీడియో లెక్చర్స్, హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అమలు చేసిన విధానం తెలియజేశారు. రూరల్ క్యాంపస్, పరిమిత వనరులు కలిగి ఉన్నప్పటికీ వీటిని నిర్మించిన విధానం నాయకత్వానికి ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు. కోర్సుల రూప కల్పన, బోధన తరగతుల నిర్వహణ, ఇంటర్న్ షిప్లు, పెరఫార్మింగ్ ఆర్ట్స్ లెక్చర్స్ అందించిన విధానం విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ జరిపిన బోదనను తెలియజేశారు. జాతీయ విద్య విధానంలో పేర్కొన్న మల్టీ డిసిప్లీనరీ ఎడ్యుకేషన్, స్థానిక, జాతీయ సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ వారసత్వం, ఇంటర్న్ షిప్లు కల్పన, పరిశ్రమ లతో అనుసందానం చేయడం, మానవ విలువలకు ప్రాధాన్యం కల్పించడం, జీవన నైపుణ్యాల ను అందించడం, వృత్తిపరమైన శిక్షణ కల్పించడం వంటివి నాడు రాము అమలు చేసిన విధానం కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రయోగశాలలు తీర్చిదిద్ది విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించడం, దేశంలోని అత్యుత్తమ ఐఐటిలతో సమానంగా ఇంటర్న్ షిప్లులు దేశంలో, ఇతర దేశాలలో అందించిన సందర్భాలను తెలియజేశారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య విధానం అందించిన ఫలితాలు, తొలిబ్యాచ్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో సాధించిన విజయాలు ఎంతో సంతృప్తిని కలిగించాయన్నాడు. *ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ పూర్వ విద్యార్ధిగా, ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులుగా సేవలందించిన ఆచార్య రాజ కుమార్ తో త నకున్న అనుబంధాన్ని వివరించారు.* ఐఐటి ఖర్గపూర్లో ఆయనతో కలసి పనిచేసిన సంధ ర్బాలను తెలియజేశారు. అడిగిన వెంటనే ఏయూలో ప్రత్యేక ప్రసంగం అందించడానికి విచ్చేసిన ఆచార్య రాజ కుమార్ను ఏయూ తరపున సత్కరించారు. *ఏయూ అవుట్ట్ డీన్ ఆచార్య డి. లలిత భాస్కరి కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ముఖ్య అతిథిని సదస్సుకు పరిచయం చేసారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జి. శశిభూషణ రావు, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్.పద్మశ్రీ మరియు డీసీలు ఆచార్య ఆనంద గజపతి రాజు, ఆచార్య సాల్మన్ టెన్ని, ఆచార్య పి. వెంకట రావు, పెద్దసంఖ్యలో ఆచార్యులు, పరిశోదకులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.*

*సృజనాత్మకత, ప్రణాళికతో నాయకత్వ వికాసం*

విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:

*సృజనాత్మకత, పటిష్ట ప్రణాళికతతో నాయకత్వ వికాసం సాద్యపడుతుందని ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులు, ఐఐటీ భువనేశ్వర్ పూర్వ డైరెక్టర్, ఆర్ జియుకటి (ఐఐఐటి) వ్యవస్థాపక ఉపకులపతి ఆచార్య ఆర్.వి రాజ కుమార్ అన్నారు.* ఆంధ్రవిశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్ప వాలలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో “ఒక ఆదర్శ విశ్వవిద్యాలయాన్ని సృష్టించడంలో నాయకత్వ సవాళ్లు మరియు సంతృప్తికరమైన అనుభవాలు అనే అంశంపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత, దూరదృష్టితో పనిచేసే తత్వం కలిగి ఉండాల ని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య ను అందించడానికి ఏర్పాటు చేసిన ఆర్. జి.యు.కె.టి ల స్థాపన, అభివృద్ధి చేసిన విధానం, తొలి నాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. ఈ ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లు. ప రిమిత వనరులతో పనిచేస్తూ పనిచేసిన విధానం వివరించారు.

సాధారణ బోధనకు భిన్నంగా వీడియో లెక్చర్స్, హైబ్రిడ్ లెర్నింగ్ విధానం అమలు చేసిన విధానం తెలియజేశారు. రూరల్ క్యాంపస్, పరిమిత వనరులు కలిగి ఉన్నప్పటికీ వీటిని నిర్మించిన విధానం నాయకత్వానికి ఉదాహరణలుగా నిలుస్తాయని తెలిపారు. కోర్సుల రూప కల్పన, బోధన తరగతుల నిర్వహణ, ఇంటర్న్ షిప్లు, పెరఫార్మింగ్ ఆర్ట్స్ లెక్చర్స్ అందించిన విధానం విద్యార్థులకు విభిన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ జరిపిన బోదనను తెలియజేశారు.

జాతీయ విద్య విధానంలో పేర్కొన్న మల్టీ డిసిప్లీనరీ ఎడ్యుకేషన్, స్థానిక, జాతీయ సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ వారసత్వం, ఇంటర్న్ షిప్లు కల్పన, పరిశ్రమ లతో అనుసందానం చేయడం, మానవ విలువలకు ప్రాధాన్యం కల్పించడం, జీవన నైపుణ్యాల ను అందించడం, వృత్తిపరమైన శిక్షణ కల్పించడం వంటివి నాడు రాము అమలు చేసిన విధానం కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రయోగశాలలు తీర్చిదిద్ది విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించడం, దేశంలోని అత్యుత్తమ ఐఐటిలతో సమానంగా ఇంటర్న్ షిప్లులు దేశంలో, ఇతర దేశాలలో అందించిన సందర్భాలను తెలియజేశారు. అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య విధానం అందించిన ఫలితాలు, తొలిబ్యాచ్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో సాధించిన విజయాలు ఎంతో సంతృప్తిని కలిగించాయన్నాడు.

*ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ పూర్వ విద్యార్ధిగా, ఐఐటి ఖర్గపూర్ పూర్వ ఆచార్యులుగా సేవలందించిన ఆచార్య రాజ కుమార్ తో త నకున్న అనుబంధాన్ని వివరించారు.* ఐఐటి ఖర్గపూర్లో ఆయనతో కలసి పనిచేసిన సంధ ర్బాలను తెలియజేశారు. అడిగిన వెంటనే ఏయూలో ప్రత్యేక ప్రసంగం అందించడానికి విచ్చేసిన ఆచార్య రాజ కుమార్ను ఏయూ తరపున సత్కరించారు.

*ఏయూ అవుట్ట్ డీన్ ఆచార్య డి. లలిత భాస్కరి కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ముఖ్య అతిథిని సదస్సుకు పరిచయం చేసారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జి. శశిభూషణ రావు, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్.పద్మశ్రీ మరియు డీసీలు ఆచార్య ఆనంద గజపతి రాజు, ఆచార్య సాల్మన్ టెన్ని, ఆచార్య పి. వెంకట రావు, పెద్దసంఖ్యలో ఆచార్యులు, పరిశోదకులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.