Saturday, 19 July 2025
  • Home  
  • ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి
- Featured

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి

13-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి, సుమారు 5 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి ఒక పైసా నిధులు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా 15సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపిస్తాను. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు అవసరమైన పనులను మంజూరు చేయించి, 9 కోట్ల రూపాయల నిధులతో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్ట పడి పనిచేసే గిరిజనులు అభివృద్ధి పై దృష్టి పెట్టి వారికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాము.టీడీపీ ప్రభుత్వ హయాంలో వైకాపా ఎమ్మెల్యే లకు నిధులివ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ ప్రారంభోత్సవాలు నాడు -నేడు కార్యక్రమంకు శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక లోటులో వున్నా ఇచ్చిన హామీలను 90శాతం అమలుచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. మందులకొనుగోలులో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు ను అరెస్టు చేస్తే బిసిలపై కక్ష సాధింపని చంద్రబాబు చెప్పారని ఈ రోజు జెసి ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేసారని ఆయన ఏసామాజిక వర్గమని ప్రశ్నించారు. అవినీతి అన్యాయంపై ఎలాంటివారినైనా క్షమించేదిలేదన్నారు. సర్వే పల్లిలో అన్నికాలనిలు అభివృద్ధి లో దూసుకుపోయేలా చేస్తామన్నారు. సంవత్సరం కాలంలో మండలంలో 12కోట్ల తో సిమెంట్ రోడ్లు 5కోట్ల తో డ్రైనేజీను నా ర్మించుకున్నామని గతంలో ఎప్పుడు ఈవిధంగా అభివృద్ధి జరగలేదని తెలిపారు.ఒక్క మనుబోలు లోనే నాలుగు కోట్ల కుపైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామనితెలిపారు. ప్రతిపేదవాడికి తనచేతులమీదుగా ఇళ్ళ పట్టాలు అందచేస్తామన్నారు. బిసికాలనిలో గతప్రభుత్వంలో వేసినరోడ్డు రెండుసంవత్సరాల కే దెబ్బతిందని దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించి ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. అభివృద్ధి సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధి చేస్తాము, కానీ అవినీతి చేస్తామంటే ఊరుకోము. ఎంతటివారైనా అవినీతి చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి అన్యాయం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. సుదీర్ఘ కాలంగా స్కూల్స్ కు సంబందించిన సమస్యలు పరిష్కారం కోసం గతంలో ఎన్ని సార్లు అడిగిన నిధులు విడుదల చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిపిస్తున్నారు కాబట్టే ప్రజలకు ముఖ్యమంత్రి గారిపై నమ్మకం ఏర్పడింది. ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాది. గతంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యే అయినా ఒక్క మనుబోలు మండలంలో ఏడాది కాలంలో 17 కోట్లతో సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు నిర్మించారా! ఏడాది కాలంలోనే నేను ఎమ్మెల్యే గా మనుబోలు మండలంలో 17 కోట్లతో సిమెంటు రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా. తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన సిమెంటు రోడ్లు లేచిపోతూ, గుంతలు పడి మున్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి. నాసిరకం సిమెంటు రోడ్ల నిర్మాణంలో బాధ్యులైన వారిపై విజిలెన్స్ విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం. అభివృద్ధి జరగాలని అనుకుంటాం తప్ప, అవినీతిని సహించేది లేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఉన్నన్ని రోజులు ఎంతటి వారైనా, అవినీతికి పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్ ,కిషోర్ నాయుడు ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి ,దాసరిమహేంద్ర వర్మ , చల్లానవకోటి, తులసి యాదవ్, వెంకటసుబ్బయ్య,గుంజి రమేష్ మండల స్థాయి అధికారులు మండల స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .


13-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలో పర్యటించి, సుమారు 5 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి ఒక పైసా నిధులు ఇవ్వలేదు.
కానీ ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా 15సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపిస్తాను.
ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు అవసరమైన పనులను మంజూరు చేయించి, 9 కోట్ల రూపాయల నిధులతో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నాం.
పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్ట పడి పనిచేసే గిరిజనులు అభివృద్ధి పై దృష్టి పెట్టి వారికి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తాము.టీడీపీ ప్రభుత్వ హయాంలో వైకాపా ఎమ్మెల్యే లకు నిధులివ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు లో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ ప్రారంభోత్సవాలు నాడు -నేడు కార్యక్రమంకు శంకుస్థాపన లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్ధిక లోటులో వున్నా ఇచ్చిన హామీలను 90శాతం అమలుచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. మందులకొనుగోలులో అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడు ను అరెస్టు చేస్తే బిసిలపై కక్ష సాధింపని చంద్రబాబు చెప్పారని ఈ రోజు జెసి ప్రభాకర్ రెడ్డి ని అరెస్ట్ చేసారని ఆయన ఏసామాజిక వర్గమని ప్రశ్నించారు. అవినీతి అన్యాయంపై ఎలాంటివారినైనా క్షమించేదిలేదన్నారు. సర్వే పల్లిలో అన్నికాలనిలు అభివృద్ధి లో దూసుకుపోయేలా చేస్తామన్నారు. సంవత్సరం కాలంలో మండలంలో 12కోట్ల తో సిమెంట్ రోడ్లు 5కోట్ల తో డ్రైనేజీను నా ర్మించుకున్నామని గతంలో ఎప్పుడు ఈవిధంగా అభివృద్ధి జరగలేదని తెలిపారు.ఒక్క మనుబోలు లోనే నాలుగు కోట్ల కుపైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశామనితెలిపారు. ప్రతిపేదవాడికి తనచేతులమీదుగా ఇళ్ళ పట్టాలు అందచేస్తామన్నారు. బిసికాలనిలో గతప్రభుత్వంలో వేసినరోడ్డు రెండుసంవత్సరాల కే దెబ్బతిందని దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించి ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. అభివృద్ధి సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారు.
అభివృద్ధి చేస్తాము, కానీ అవినీతి చేస్తామంటే ఊరుకోము.
ఎంతటివారైనా అవినీతి చేస్తే శిక్ష అనుభవించక తప్పదు.
గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి అన్యాయం జరిగింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.
సుదీర్ఘ కాలంగా స్కూల్స్ కు సంబందించిన సమస్యలు పరిష్కారం కోసం గతంలో ఎన్ని సార్లు అడిగిన నిధులు విడుదల చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి గారు నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిపిస్తున్నారు కాబట్టే ప్రజలకు ముఖ్యమంత్రి గారిపై నమ్మకం ఏర్పడింది.
ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే.
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాది.
గతంలో పనిచేసిన ఏ ఎమ్మెల్యే అయినా ఒక్క మనుబోలు మండలంలో ఏడాది కాలంలో 17 కోట్లతో సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు నిర్మించారా!
ఏడాది కాలంలోనే నేను ఎమ్మెల్యే గా మనుబోలు మండలంలో 17 కోట్లతో సిమెంటు రోడ్లు, సైడు కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించా.
తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన సిమెంటు రోడ్లు లేచిపోతూ, గుంతలు పడి మున్నాళ్ల ముచ్చటగా తయారయ్యాయి.
నాసిరకం సిమెంటు రోడ్ల నిర్మాణంలో బాధ్యులైన వారిపై విజిలెన్స్ విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం.
అభివృద్ధి జరగాలని అనుకుంటాం తప్ప, అవినీతిని సహించేది లేదు.
సర్వేపల్లి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఉన్నన్ని రోజులు ఎంతటి వారైనా, అవినీతికి పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,కడివేటిచంద్రశేఖర్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్ ,కిషోర్ నాయుడు ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి ,దాసరిమహేంద్ర వర్మ , చల్లానవకోటి, తులసి యాదవ్, వెంకటసుబ్బయ్య,గుంజి రమేష్ మండల స్థాయి అధికారులు మండల స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.