*ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం*
*జిల్లా టిడిపి అభ్యర్థులు గండి బాబ్జి*
విశాఖ అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా జిఎస్టి సంస్కరణలు చేసిన నేపథ్యంలో ఏయూ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా భాగ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా క్షేమానికి శ్రేయస్సుకి కట్టుబడి ఉందని అన్నారు . అందులో భాగంగానే జిఎస్టి సంస్కరణలు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేయడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు చేసిన ర్వాత వినియోగదారులు కొనుగోలు ఎక్కువగా చేస్తున్నారని తద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగం పడుతుందని చెప్పారు.ఎగ్జిబిషన్ కి వచ్చిన వినియోగదారులను వ్యాపారస్తులను ధరలు సంస్కరణలు చేయకముందే ఎలా ఉన్నాయి చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అని మాట్లాడినప్పుడు వినియోగదారులు వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శనకి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహనాన్ని బాబ్జి నడిపి పరిశీలించారు


