వి ఎం ఆర్ డి ఎ ప్రజా దర్బార్ కి వచ్చిన వినతులను నిశితంగా పరిశీలించి, వాటిని పరిష్కరించటానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ఛాంబర్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజా దర్బార్ కి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వినతులకు సంబంధిత అధికారులకు అందజేసి, నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు వాటిని క్రమబద్ధీకరించుకొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిచిందని, ఎల్ ఆర్ ఎస్- 2020 పథకానికి కొనసాగింపు కల్పించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కి మొత్తం 6 వినతులు రాగా, వాటిలో ప్లానింగ్ -3, ఎస్టేట్-2 , ఇంజనీరింగ్- 1 చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఇతర విభాగ అధికారులు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్ కి వచ్చే వినతుల పరిష్కరించటానికి ప్రాధాన్యత ఇవ్వాలి వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్
వి ఎం ఆర్ డి ఎ ప్రజా దర్బార్ కి వచ్చిన వినతులను నిశితంగా పరిశీలించి, వాటిని పరిష్కరించటానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ఛాంబర్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజా దర్బార్ కి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వినతులకు సంబంధిత అధికారులకు అందజేసి, నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు వాటిని క్రమబద్ధీకరించుకొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిచిందని, ఎల్ ఆర్ ఎస్- 2020 పథకానికి కొనసాగింపు కల్పించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కి మొత్తం 6 వినతులు రాగా, వాటిలో ప్లానింగ్ -3, ఎస్టేట్-2 , ఇంజనీరింగ్- 1 చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఇతర విభాగ అధికారులు పాల్గొన్నారు.

